Begin typing your search above and press return to search.

మెగాస్టార్ - జై హనుమాన్.. మ్యాటరెంటీ?

ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం స్టార్ యాక్టర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఈ క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవి అయితే బెటర్ అని భావిస్తున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2024 9:42 AM GMT
మెగాస్టార్ - జై హనుమాన్.. మ్యాటరెంటీ?
X

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ ఏడాది సంక్రాంతికి హనుమాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సొంతం చేసుకున్నారు. తేజ సజ్జా ఈ సినిమాలో సూపర్ హీరోగా కనిపించి మెప్పించాడు. హనుమాన్ క్యారెక్టర్ రిఫరెన్స్ తో ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఫస్ట్ సూపర్ హీరో మూవీగా ఆవిష్కరించారు. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

పాన్ ఇండియా లెవెల్ లో హనుమాన్ సినిమా రిలీజ్ కావడంతో ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ టైటిల్ తో మూవీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. హనుమాన్ మూవీ క్లైమాక్స్ లో కూడా జై హనుమాన్ ఉండబోతుందని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తో రిప్రజెంట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందని ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు.

అయితే జై హనుమాన్ కంటే ముందుగా రణవీర్ సింగ్ తో ఒక సూపర్ హీరో మూవీ చేయాలని ప్రశాంత్ వర్మ అనుకున్నారు. క్రియేటివ్ డిఫరెన్స్ వలన ఈ సినిమా ఆగిపోయింది. మరల ప్రశాంత్ వర్మ జై హనుమాన్ పైన ఫోకస్ పెట్టారు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్ర కోసం స్టార్ యాక్టర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ ఈ క్యారెక్టర్ కోసం మెగాస్టార్ చిరంజీవి అయితే బెటర్ అని భావిస్తున్నారు. అతని డేట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా జై హనుమాన్ మూవీకి చిరంజీవి లేదంటే రామ్ చరణ్ అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ప్రశాంత్ వర్మ మాత్రం చిరంజీవి అయితే బెస్ట్ ఛాయిస్ అని భావిస్తున్నారంట. కానీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సినిమాల లైన్ అప్ చూసుకుంటే రెండేళ్ళ వరకు ఆయన అందుబాటులో ఉండే ఛాన్స్ లేదనే మాట వినిపిస్తుంది. ప్రస్తుతం చిరంజీవి వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాని సోషియో ఫాంటసీ కథాంశంతో చేస్తున్నారు.

నెక్స్ట్ మోహనరాజా దర్శకత్వంలో ఒక మూవీ ఉంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉందంట. దీని తర్వాత మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు లైన్ లో ఉన్నారు. హరీష్ శంకర్ కూడా ఇప్పటికే చిరంజీవికి ఒక కథ చెప్పారని టాక్ వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ కేవీ అనుదీప్ కూడా కామెడీ కథని నేరేట్ చేశారంట. మరి కొంతమంది దర్శకులు కూడా చిరంజీవి దృష్టిలో ఉన్నారు.

విశ్వంభర మూవీ లైన్ లో ఉండగానే అలాంటి ఫిక్షనల్ కథని వెంటనే చిరంజీవి ఓకే చేస్తారా అనేది సందేహస్పదం అని చెప్పాలి. రామ్ చరణ్ కూడా ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్తున్నారు. నెక్స్ట్ సుకుమార్ దర్శకత్వంలో సినిమా ఉంది. ఈ రెండింటి తర్వాతనే రామ్ చరణ్ డేట్స్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ టైటిల్ రోల్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా ప్రశాంత్ వర్మ చేయబోతున్నారు. అది ఈ ఏడాదిలోనే స్టార్ట్ అవుతుందని టాక్ ఉంది. మోక్షజ్ఞ చిత్రం తర్వాత జై హనుమాన్ చేస్తారా లేదంటే ముందుగానే కంప్లీట్ అయిపోతుందా అనేది వేచి చూడాలి.