Begin typing your search above and press return to search.

జై హనుమాన్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదు

అసలు ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు.

By:  Tupaki Desk   |   17 April 2024 8:41 AM GMT
జై హనుమాన్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదు
X

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెద్దగా స్టార్ క్యాస్ట్ లేకున్నప్పటికి పాన్ ఇండియా రేంజ్ లో సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అసలు ఈ రేంజ్ లో సినిమా సక్సెస్ అవుతుంది అని ఎవరు ఊహించలేదు. యువ హీరో తేజ సజ్జా, దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇద్దరు కూడా విడుదలకు ముందే ప్రమోషన్ చేసిన విధానం కూడా సినిమాను జనాలకు ఇంకా బాగా దగ్గర చేసింది.


ఇక ఈ సినిమా తర్వాత కొనసాగింపుగా సీక్వెల్ కూడా ఉంటుంది అని దర్శకుడు ముందుగానే క్లారిటీ ఇచ్చేసాడు. అంతే కాకుండా జై హనుమాన్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. తప్పకుండా ఆ సినిమా అంతకుమించి అనేలా ఉండబోతుంది అని ఎప్పటికప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పోస్టర్ను కూడా విడుదల చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ.

అందులో శ్రీరాముడు ఆంజనేయుడు చేతిలో చేయి వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. హనుమాన్ సినిమా చివరలో కూడా శ్రీరాముడు హనుమాన్ మధ్యలో ఒక వాగ్దానం ఉంటుందని వివరణ ఇచ్చారు. ఇక ఆ వాగ్దానం ఏమిటి అనేది జై హనుమాన్ లో తెలుస్తుంది అని మంచి ఆసక్తిని కలిగించారు. ఇక జై హనుమాన్ పోస్టర్ విడుదల చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ విధంగా వివరణ ఇచ్చాడు.

హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతూ ఈ పవిత్రమైన శ్రీరామనవమి రోజు అందరికీ నేను మాట ఇస్తున్నాను.. అని సినిమాపై తనకున్న కాన్ఫిడెన్స్ ని తెలియజేశాడు. అంతేకాకుండా జై హనుమాన్ సినిమాకు సంబంధించిన పనులు ఏడాది క్రితం మొదలయ్యాయి అని ఇదివరకే మేకర్స్ వివరణ ఇచ్చారు. ఇక పూర్తిస్థాయిలో కథ సిద్ధంగా ఉంది అని ఇక సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలియజేశారు.

జై హనుమాన్ లో హనుమంతుడిగా కనిపించేది ఎవరు? అలాగే శ్రీరాముడిగా ఏ హీరో కనిపిస్తాడు అనేది కూడా ఆసక్తిగా మారింది. ఆ మధ్య రానా దగ్గుబాటి హనుమాన్ గా కనిపించబోతున్నాడు అంటూ రకరకాల గాసిప్స్ వచ్చాయి. కానీ మేకర్స్ ఇంకా ఆ విషయంపై స్పందించలేదు. ఇక దర్శకుడు ప్రశాంత్ వర్మ త్వరలోనే అన్నీ సందేహాలకు అద్భుతమైన అప్డేట్ తో క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.