Begin typing your search above and press return to search.

మెగా కోడ‌లు ఉపాసన తాతకు కారు ప్రమాదం!

అపోలో హాస్పిట‌ల్ చైర్మెన్ ప్ర‌తాప్ రెడ్డి ప్ర‌యాణిస్తోన్న కారు స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురైంది.

By:  Tupaki Desk   |   6 Jun 2024 9:10 AM GMT
మెగా కోడ‌లు ఉపాసన తాతకు కారు ప్రమాదం!
X

అపోలో హాస్పిట‌ల్ చైర్మెన్ ప్ర‌తాప్ రెడ్డి ప్ర‌యాణిస్తోన్న కారు స్వ‌ల్ప ప్ర‌మాదానికి గురైంది. చెన్నైలో ఓ వ్యాన్ ప్ర‌తాప్ రెడ్డి కారు మీద‌కు దూసుకొచ్చింది. దీంతో ఆయ‌న తృటిలో ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌నపై చెన్నై పోలీసులు కేసు న‌మోదు చేసారు. ప్ర‌మాదంలో ఎవ‌రిక ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు, మెగా ఫ్యామిలీ ఊపిరి పీల్చుకుంది. ప్ర‌మాదానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ప్ర‌తాప్ రెడ్డి కి మెగా కోడలు ఉపాస‌న‌కు స్వ‌యంగా తాత‌య్య అన్న సంగ‌తి తెలిసిందే. బిజినెస్ రంగంలో తాత‌య్య‌ని స్పూర్తిగా తీసుకునే ఉపాస‌న ముందుకెళ్తున్నారు. ప్రస్తుతం అపోలో గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉపాస‌న‌ బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. అలాగే మెగా కోడ‌లిగా ఇంటి బాధ్య‌త‌లు అంతే విధిగా నిర్వ‌ర్తిస్తున్నారు. చ‌ర‌ణ్‌-ఉపాస‌న ఎంత అన్యోన్యంగా ఉంటారో చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ దంప‌తుల‌కు క్లీంకార అనే ముద్దుల కుమార్తె క‌ల‌దు.

సోష‌ల్ మీడియాలో ఉపాస‌న ఎంతో యాక్టివ్ గా ఉంటారు. కుటుంబానికి సంబంధించిన ప్ర‌తీ విష‌యాన్ని అభిమాను ల‌తో పంచుకుంటారు. అలాగే సామాజిక దృక్కోణంలోనూ ఆమె ఎంతో చురుక‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. అవేర్ నేస్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఇలా అన్ని రంగాల్లోనూ ఉపాస‌న ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా తాత‌య్య కారు యాక్సిడెంట్ కి సంబంధించి ఉపాస‌న ఎలా స్పందిస్తారో చూడాలి.

అలాగే రామ్ చ‌ర‌ణ్ ప్ర‌స్తుతం `గేమ్ ఛేంజ‌ర్` షూటింగ్ లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి అంకానికి రావ‌డంతో వీలైనంత త్వ‌ర‌గా ముగించాల‌ని శంక‌ర్ వేగంగా ప‌నిచేస్తున్నారు. ఈ సినిమా అనంత‌రం చ‌ర‌ణ్ బుచ్చిబాబు ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్క‌నున్న కొత్త సినిమా షూట్ లో జాయిన్ అవుతారు