ప్రతినిధి-2 సెన్సార్.. రన్ టైమ్ ఎంతంటే?
సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ప్రతినిధి-2 మూవీ యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా రన్ టైమ్ 136 నిమిషాలుగా (2 గంటల 16 నిమిషాలు) ప్రకటించారు.
By: Tupaki Desk | 7 May 2024 1:32 PM GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ కొన్నేళ్ల గ్యాప్ తర్వాత ప్రతినిధి-2 మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. పదేళ్ల క్రితం రిలీజైన ప్రతినిధికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సీనియర్ జర్నలిస్ట్ మూర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నారా రోహిత్.. సమకాలీన రాజకీయాలపై ప్రశ్నలు సంధించే జర్నలిస్ట్ పాత్రలో అలరించనున్నారు. ఇటీవల ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ అనౌన్స్ చేశారు.
వాస్తవానికి ఈ సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మేకర్స్ ఏప్రిల్ 25వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు. పదేళ్ల క్రితం ప్రతినిధి సినిమా కూడా అదే తేదీన రిలీజ్ అయింది. కానీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడం వల్ల మూవీ రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు మే 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు మూడు రోజుల ముందే ఈ సినిమా రిలీజ్ కానుండడం విశేషం.
ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీపై హైప్ క్రియేట్ చేశాయి. టీజర్ లోని 'ఇప్పటికైనా కళ్లు తెరవండి. ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓట్లు వేయండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అది కూడా కుదరకపోతే చచ్చిపోండి' అనే డైలాగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ఇక తాజాగా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ ను పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు అధికారుల నుంచి ప్రతినిధి-2 మూవీ యూ/ఏ సర్టిఫికెట్ అందుకున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సినిమా రన్ టైమ్ 136 నిమిషాలుగా (2 గంటల 16 నిమిషాలు) ప్రకటించారు. అసమానతలకు వ్యతిరేకంగా ఒక వ్యక్తి పోరాడతారంటూ ట్వీట్ చేశారు. మే 10న ప్రతినిధి-2 అంటూ మరోసారి రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఇప్పుడు ప్రతినిధి-2 మూవీ రిలీజ్ కు అంతా రెడీ అన్నమాట.
ఈ మూవీని వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్లపై కుమార్ రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఫిమేల్ లీడ్ రోల్ లో సిరి లెల్లా నటిస్తున్నారు. ఉదయభాను, సచిన్ ఖేడ్కర్, రఘుబాబు, జిస్సూ సేన్ గుప్తా, అజయ్ ఘోష్, తనికెళ్ల భరణి, దినేష్ తేజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.