Begin typing your search above and press return to search.

ఆమెతో లిప్ లాక్ ..ఒణికిపోయిన న‌టుడు!

లిప్ లాక్ స‌న్నివేశాలు..ఇంటిమేట్ సీన్స్ అన్ని ఇప్పుడు అన్ని భాష‌ల్లోనూ కామ‌న్ గా క‌నిపిస్తున్నావే.

By:  Tupaki Desk   |   2 Feb 2025 3:30 PM GMT
ఆమెతో లిప్ లాక్ ..ఒణికిపోయిన న‌టుడు!
X

లిప్ లాక్ స‌న్నివేశాలు..ఇంటిమేట్ సీన్స్ అన్ని ఇప్పుడు అన్ని భాష‌ల్లోనూ కామ‌న్ గా క‌నిపిస్తున్నావే. సీన్ డిమాండ్ చేసిందంటే? ఎవ్వ‌రూ తగ్గ‌డం లేదు. స‌హజంగానే ఆయా స‌న్నివేశాల్ని ర‌క్తిక‌ట్టిస్తున్నారు. న‌టీన‌టుల మ‌ధ్య పర్పెక్ట్ ఎమోష‌న్ క్యారీ చేయ‌డం కోసం మేక‌ర్స్ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. విష‌యంలో న‌టీన‌టులు కూడా మేక‌ర్స్ కి అలాగే స‌హ‌క‌రిస్తున్నారు. సిగ్గు, బిడియం వ‌దిలేసి ఓ రేంజ్ లో చెల‌రేగుతున్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టుడు ప్ర‌తీక్ గాంధీ ..విద్యాబాల‌న్ తో అద‌ర చుంబ‌నం అనుభూతిని పంచుకున్నాడు. వ‌య‌సు లో ఇద్ద‌రి మ‌ధ్య రెండేళ్లు వ్య‌త్యాసం ఉంది. విద్యాబాల‌న్ గాంధీ కంటే పెద్ద‌ది. అయినా గాంధీ ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ముద్దాడిన‌ట్లు చెబుతున్నాడు. ఆ సంగ‌తేంటో అతడి మాట‌ల్లోనే...` ఇంత‌కు ముందు ఎప్పుడు పెద‌వి స‌న్నివేశాల్లో న‌టించ‌లేదు. తొలిసారి విద్యాబాల‌న్ తో లిప్ లాక్ స‌న్నివేశంలో న‌టించాల్సి వ‌చ్చింది.

ఆ స‌న్నివేశం గురించి ద‌ర్శ‌కుడు చెప్ప‌గానే కంగారు ప‌డ్డాను. నా క‌న్నా సీనియ‌ర్...వ‌య‌సుతో పెద్ద‌ది. అలాంటి న‌టితో లిప్ లాక్ అసౌక‌ర్యంగా అనిపించింది. వ్య‌క్తిగ‌తంగా నాకంటూ కొన్ని నియ‌మ నిబంధ‌న‌లున్నాయి. ఒక స‌న్నివేశాన్ని చెప్ప‌డానికి చాలా మార్గాలుంటాయి. కేవ‌లం క‌ళ్ల‌తో కూడా చూడొచ్చు. అయితే ఆ స‌న్నివేశం ఏం కోరుకుందో విద్య‌కు బాగా తెలుసు. ఆ సీన్ షూట్ చేసే స‌మ‌యంలో విద్యాబాల‌న్ చాలా ఉల్లాసంగా క‌నిపించారు.

కానీ నాకు మాత్రం చెమ‌ట‌లు ప‌డ్డాయి. కాళ్లు ఒణికాయి. అసౌక‌ర్యంగా అనిపించింది. కానీ విద్య నాకెంతో స‌హ‌క రించింది. అందుకే ఆ స‌న్నివేశంలో న‌టించ‌గ‌లిగాను` అని అన్నాడు. ఇద్ద‌రు జంట‌గా `దో ఔర్ దో ప్యార్` చిత్రంలో న‌టించారు. కానీ ఆసినిమా పెద్ద‌గా స‌క్సెస్ అవ్వ‌లేదు. కానీ త‌మ న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నారు.