యూనియన్ దెబ్బకి కమ్ములా కూడా సైలెంట్!
టాలీవుడ్ లో పనిచేసే మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దర్శకురాళ్లు ఇద్దరో..ముగ్గురో ఉంటారు.
By: Tupaki Desk | 28 May 2024 2:30 PM GMTటాలీవుడ్ లో పనిచేసే మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. దర్శకురాళ్లు ఇద్దరో..ముగ్గురో ఉంటారు. ఇక మిగతా నిర్మాతగా బ్యాకెండ్లో ఎంతో మంది ఉన్నా? ముందుకొచ్చి పనిచేసి కొంత మందే. అందులో అశ్వీనిదత్ కుమార్తులు ముందు వరుసలో ఉంటారు. ఇక మిగతా శాఖల నుంచి చూస్తే పెద్దగా కనిపించరు. కోరియగ్రఫీలో చాలా మంది ఉన్నారు. కానీ వెలుగులోకి రానివారు ఎంతో మంది. ఇక ప్రొడక్షన్ డిజైన్ విభాగాల నుంచి చూసుకుంటే మహిళలు ఉన్నారా? అన్న సందమేహే కలుగుతుంది.
అలాంటి వారిలో మహిళా ప్రొడక్షన్ డిజైనర్లలో ప్రవల్యా ఒకరు . `గామి`, `అశోకవనంలో అర్జున కళ్యాణం` లాంటి సినిమాలకు పనిచేసారు. అయితే ప్రొడక్షన్ డిజైనర్ గా ఇండస్ట్రీలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కున్నారె తాజాగా రివీల్ చేసారు. ఈ రెండు సినిమాల తర్వాత `కుబేర`లో అవకాశం లభించింది. డీఓపీ, డైరక్షన్ టీమ్, ప్రొడక్షన్ డిజైన్‌లో ఉన్న ఇతర కొలిగ్స్‌తో కలిసి పని చేయటం ఒక సవాలు. ఇండస్ట్రీలో చాలా కాలంగా పని చేసినవాళ్లు ఉంటారు. వాళ్లతో సమస్యలు ఎక్కువగా వస్తాయి. `ఈ పిల్లకు ఏం తెలుసు? ఇన్నేళ్లుగా మేం పని చేస్తున్నాం` అనే ఈగో సమస్యలు వస్తాయి. నాకు సృజనాత్మకతకు సంబంధించి ఎటువంటి సమస్యలూ లేవు.
మనుషుల మేనేజిమెంట్ దగ్గరే అసలైన సవాళ్లు ఎదురయ్యాయి. `గామి` చిత్రంలో నేను నేర్చుకున్న పాఠాలను ఏ కాలేజీలో నేర్పరు. ఇండస్ట్రీలో మన కన్నా సీనియర్లు ఉంటారు. వాళ్ల అనుభవాలు వారికి ఉంటాయి. నా ఉద్దేశంలో అందరినీ కలుపుకొని పోవటమనేది ఎవరికైనా ఎదురయ్యే పెద్ద సవాలు. దీనిని అధిగమిస్తే విజయం చాలా సులభమనిపిస్తుంది. `గామి` షూటింగ్‌లో నేను అనేక సమస్యలు ఎదుర్కొన్నా. ముఖ్యంగా నాకు యూనియన్ల గురించి తెలియదు. అందువల్ల కళాశాలల్లో చదువుకొనే విద్యార్థులతో పని చేసేదాన్ని.
ఇప్పుడు నాకు సృజనాత్మకత, వనరుల సమస్య లేదు. కానీ యూనియన్లతోనే సమస్య వస్తోంది. నేను `కుబేర` చిత్రం రెండు షెడ్యూల్స్ చేసిన తర్వాత యూనియన్‌వాళ్లు అడ్డు చెప్పారు. నాకు యూనియన్ కార్డు లేదు కాబట్టి నేను ఆ సినిమా చేయకూడదనేది వాళ్ల అభ్యంతరం. పని చేయటానికి సెట్‌లోకి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. దాంతో నేను ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్నిసార్లు ఈ రాజకీయాలు చూస్తే బాధ కలుగుతుంది. ఒకప్పుడు నాకన్నా టాలెంట్ ఉన్నవారు సినిమా రంగంలోకి ఎందుకు రావటంలేదని అనుకొనేదాన్ని.
టాలెంట్ ఒకటే ఉంటే సరిపోదని.. ఇండస్ట్రీ ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలని ఇప్పుడు అర్థమవుతోంది. ఈ రాజకీయాలను తట్టుకొని నిలబడలేక- వదిలేసి వెళ్లిపోదామనుకున్నా. కానీ శేఖర్ సర్ `ఇలాంటి రాజకీయాలన్నీ ఉంటాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. పోరాడాలి` అని చెప్పారు. నాకు మద్దతుగా నిలిచారు. అయితే ఆయన కూడా ఏం చేయలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. నేనుఎంత పోరాడినా... చివరకు యూనియన్ గెలిచింది` అని తెలిపారు.