ఇప్పటికీ పెదవి దాటని మాటొకటుంది అలాగే!
ముంబై బ్యూటీ ప్రీతీ ఝుంగియానీ గురించి పరిచయం అవసరం లేదు. అప్పట్లో తెలుగులో చాలా సినిమాల్లో నటించింది.
By: Tupaki Desk | 30 March 2025 4:30 PMముంబై బ్యూటీ ప్రీతీ ఝుంగియానీ గురించి పరిచయం అవసరం లేదు. అప్పట్లో తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. `తమ్ముడు`లో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించింది. అదే అమ్మడికి తెలుగులో తొలి చిత్రం. అటుపై `నరసింహ నాయుడు`, `అధిపతి`, `అప్పారావు డ్రైవింగ్ స్కూల్`, `ఆనందమా నంద మయే`, `విశాఖ ఎక్స్‌ప్రెస్` వంటి చాలా సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ లో రిలీజ్ అయిన `యమదొంగలో` ఓ ప్రత్యేక పాటలో కూడా అలరించింది.
`తేజం` అనేది అమ్మడి చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. హిదీ, కన్నడం, బెంగాలీ , పంజాబీ, రాజస్తానీ చిత్రాల్లో కూడా నటించింది. ఇప్పుడు నటిగా అక్కడ కూడా యాక్టివ్ గా లేదు. 2017 నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. సోషల్ మీడియాలో కూడా పెద్దగా ఎప్పుడూ కనిపించదు. ఆమె జనరేషన్ హీరోయిన్ కొంత మంది సెకెండ్ ఇన్నింగ్స్ లో రాణిస్తున్నారు.
కానీ ప్రీతి మాత్రం అలాంటి ప్రయత్నాలు కూడా చేయలేదు. వివాహం అనంతరం కొన్నిసినిమాలు చేసి కుటుంబ జీవితానికే అంకిత మైంది. అలాంటి బ్యూటీ తాజాగా టైమ్స్ ఫుడ్ అండ్ నైట్‌లైఫ్ అవార్డ్స్ ఈవెంట్‌లో తళుక్కున మెరిసింది. కొన్ని సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు రావడం ఇదే తొలిసారి. పింక్ వర్ణం ఔట్ ఫిట్ లో తళుక్కున మెరిసింది. ఇప్పటికీ అదే అందంతో కవ్విస్తుంది.
అమ్మడి స్కిన్ టోన్ పాల నురుగుల సౌందర్యంలా తళ తళలాడుతుంది. రెడ్ కార్పెట్ పై ప్రీతి హోయలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా కాలం తర్వాత పీసీని ఫోటోలు చూసి అమె అభిమానులు ఒక్కసారి గా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతున్నారు. పెదవి దాటని మాట ఒకటుంది అంటూ తమ్మడు పాటేసుకుం టున్నారు.