బతికే ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు: ప్రీతి జింతా
ప్రీతి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉంది. అక్కడ అడవి మంటల్లో చిక్కుకున్నానని, హార్ట్ బ్రేక్ అయిందని వెల్లడించింది.
By: Tupaki Desk | 12 Jan 2025 3:30 PM GMTప్రీతి జింతా పరిచయం అవసరం లేదు. మహేష్ బాబు సరసన నాని, వెంకటేష్ సరసన ప్రేమతో రా లాంటి చిత్రాల్లో నటించింది. ఈ సొట్ట బుగ్గల సుందరి అందచందాలు, నట ప్రతిభకు తెలుగు యువత ఫిదా అయిపోయారు. కానీ ప్రీతి ఆ తర్వాత తెలుగులో నటించలేదు. దశాబ్ధం పైగానే బాలీవుడ్ కి పరిమితమైంది.
విదేశీ బోయ్ ఫ్రెండ్ జీన్ గూడెనఫ్ ని పెళ్లాడిన ప్రీతిజింతా సరోగసీలో కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రీతి ప్రస్తుతం లాస్ ఏంజెల్స్ లో ఉంది. అక్కడ అడవి మంటల్లో చిక్కుకున్నానని, హార్ట్ బ్రేక్ అయిందని వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ అప్‌డేట్‌ను షేర్ చేసింది. లాస్ ఏంజిల్స్‌లో కార్చిచ్చు మధ్య తాను, తన కుటుంబం చిక్కుకున్నామని, అదృష్టవశాత్తూ ఇప్పటి వరకు సురక్షితంగా ఉన్నామని అభిమానులకు తెలిపింది ప్రీతి.
``LAలో మా చుట్టూ ఉన్న పొరుగు ప్రాంతాలను మంటలు నాశనం చేసే రోజును చూడటానికి నేను బతికే ఉంటానని ఎప్పుడూ అనుకోలేదు, స్నేహితులతో పాటు, చాలా కుటుంబాలు ఖాళీ చేసారు. ప్రాంతమంతా హై అలర్ట్‌లో ఉంది. మంచుతో భయం ..గాలి చల్లబడకపోతే భయం.. పొగమంచు కారణంగా ఆకాశం నుండి బూడిద దిగుతోంది. పసిపిల్లలు తాతామామలు మాతో ఉన్నారు. ఈదురు గాలులు శాంతించకపోతే ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితిలో ఉన్నామ``ని ప్రీతి వెల్లడించారు. చుట్టూ విధ్వంసం చూసాక హృదయ విదారకం. ప్రస్తుతం సురక్షితంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాను.. అని ప్రీతి అంది. అగ్నిమాపక సిబ్బంది, ప్రాణాలను, ఆస్తిని కాపాడటానికి సహాయం చేసిన వారందరికీ కృతజ్ఞతలు.. అని ముగించింది.
వేల ఎకరాల భూమిలో ఆస్తులను నాశనం చేసిన మంటల గురించి వ్యాఖ్యానిస్తూ మొదటి స్పందనదారుగా ప్రియాంక చోప్రా పేరు వినిపించింది. ప్రస్తుతం ప్రీతి జింతా దీనిపై స్పందించింది. లాస్ ఏంజిల్స్‌లోని కొన్ని ప్రాంతాలను కార్చిచ్చు చుట్టుముట్టిన దృశ్యాలను చూపించే వీడియోను ప్రియాంక ఇంతకు ముందు పోస్ట్ చేసింది.
మంటలు విధ్వంసం సృష్టించిన తర్వాత నటి నోరా ఫతేహి జనవరి 9న కాలిఫోర్నియాను ఖాళీ చేయించారని తెలిపింది. నేను ఇంతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ అనుభవించలేదు. కేవలం అదుపు చేయలేని మంటలు చూసాను. నేను మిమ్మల్ని అప్‌డేట్ చేస్తాను అని నోరా తెలిపారు.
జనవరి 7న లాస్ ఏంజిల్స్‌లో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో వేలాది మందిని వారి నివాసాల నుంచి ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ లాస్ ఏంజిల్స్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.