Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో ఎఫైర్.. న‌టికి ఊహించ‌ని ప్ర‌శ్న‌

తాజా ఇంట‌రాక్ష‌న్ లో ప్రీతి జింతాకు ఇలాంటి ఒక ప్ర‌శ్న ఎదురైంది. ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రీతిని ఓ నెటిజ‌న్ సూటిగా ఒక ప్ర‌శ్న అడిగాడు.

By:  Tupaki Desk   |   28 Dec 2024 5:30 PM GMT
స్టార్ హీరోతో ఎఫైర్.. న‌టికి ఊహించ‌ని ప్ర‌శ్న‌
X

బాలీవుడ్ హిట్ పెయిర్స్ లో స‌ల్మాన్ ఖాన్- ప్రీతి జింతా ఎక్కువ‌గా చర్చ‌ల్లో నిలిచిన జంట‌. హర్ దిల్ జో ప్యార్ కరేగా (2000), చోరీ చోరీ చుప్కే చుప్కే (2001), దిల్ నే జిసే అప్నా కహా (2004), జాన్-ఇ-మాన్ (2006), హీరోస్ (2008) లాంటి ప‌లు హిట్ చిత్రాల్లో ఈ జంట న‌టించారు.

పెద్ద తెర‌పై సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రితో స‌ల్మాన్ ప్రేమ స‌న్నివేశాలు.. రొమాన్స్ బాగా వ‌ర్క‌వుట‌య్యాయి. దీంతో ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఏదో జ‌రుగుతోంద‌ని పుకార్లు షికార్ చేసాయి. తాజా ఇంట‌రాక్ష‌న్ లో ప్రీతి జింతాకు ఇలాంటి ఒక ప్ర‌శ్న ఎదురైంది. ఇంత‌కుముందు స‌ల్మాన్ ఖాన్ కి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలిపిన ప్రీతిని ఓ నెటిజ‌న్ సూటిగా ఒక ప్ర‌శ్న అడిగాడు. స‌ల్మాన్ తో మీరు ఎప్పుడైనా డేటింగ్ చేశారా? అంటూ అత‌డు ధైర్యంగా ప్ర‌శ్నించాడు.

దానికి ప్రీతి వెంట‌నే స‌మాధానం ఇచ్చింది. ''స‌ల్మాన్ మంచి స్నేహితుడు. నా కుటుంబం. అతడు నా భ‌ర్త‌కు కూడా స్నేహితుడు.. ఇంత‌కంటే స‌మాధానం ఏం కావాలి? అని ప్ర‌శ్నించింది. స‌ల్మాన్ తో త్రోబ్యాక్ ఫోటోల‌ను కూడా ప్రీతి షేర్ చేసి స్మైల్ ఈమోజీల‌తో క్యాప్ష‌న్ లు ఇచ్చింది. ''హ్యాపీ బర్త్ డే @బీయింగ్ సల్మాన్ ఖాన్, నేను నిన్ను అత్యంత ప్రేమిస్తున్నానని చెప్పాలనుకుంటున్నాను. నేను మీతో మాట్లాడినప్పుడు ప్ర‌శాంతంగా ఉంటుంది. మీతో మాకు మరిన్ని ఫోటోలు కావాలి.. లేకుంటే నేను పాత వాటిని పోస్ట్ చేస్తూనే ఉంటాను!'' అని జాలీగా వ్యాఖ్యానించింది. స‌ల్మాన్ తో డేటింగ్ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా త‌మ మ‌ధ్య అందుకు ఆస్కారం లేద‌ని బదులిచ్చింది.

బాలీవుడ్ లో మంచి రొమాంటిక్ డ్రామాలు రావడం లేద‌ని ఒక అభిమాని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌గా, తాను కూడా ఇలానే ఫీల‌వుతున్నాన‌ని ప్రీతి వ్యాఖ్యానించింది. మంచి హృద‌యం ఉన్న వారి నుండి కొన్ని మంచి రచనలు, కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయని ఆశిస్తున్నాను అని అంది.

భ‌ర్త జీన్ గూడెన‌ఫ్‌- పిల్ల‌ల‌తో హ్యాపీ లైఫ్ గురించి ప్రీతి జింతా మాట్లాడింది. మూడేళ్ల వ‌య‌సున్న క‌వ‌ల‌ల‌తో అస్స‌లు విసుగు క‌ల‌గ‌డం లేద‌ని ప్రీతి వెల్ల‌డించింది. అయితే ఎక్క‌డికైనా ప్ర‌యాణం చేయాల్సి వ‌స్తే గ‌నుక పిల్ల‌ల‌ను వ‌దిలేశాన‌నే అప‌రాధ భావ‌న క‌ల‌గ‌కుండా వీలైనంత వరకు జాగ్ర‌త్త‌ప‌డ‌తాన‌ని తెలిపింది.

రాజ్‌కుమార్ సంతోషి 'లాహోర్ 1947' చిత్రంతో ప్రీతీ తిరిగి న‌ట‌న‌లో ప్ర‌వేశిస్తోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా గ్యాప్ త‌ర్వాత సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తిరిగి తెర‌పై క‌నిపించ‌బోతోంది. షబానా అజ్మీ, అలీ ఫజల్, సన్నీ డియోల్, కరణ్ డియోల్ త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు.