సూపర్‌స్టార్‌ని చెంప దెబ్బ కొట్టిన నటి
ప్రీతి జింటా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో అభిమానులతో మాట్లాడుతూ `కభీ అల్విదా నా కెహ్నా` (2006) చిత్రీకరణ సమయంలో షారూఖ్ చెంప దెబ్బ ఎపిసోడ్‌ని గుర్తు చేసుకుంది.
By: Tupaki Desk | 23 Feb 2025 6:30 PM GMTఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రీతి జింటా తన కోస్టార్ షారూఖ్ ని చెంప దెబ్బ కొట్టానని తెలిపారు. అయితే అది సరదా కోసం కాదు.. సన్నివేశం కోసం.. నేను అతడిని కొట్టలేదు. నా పాత్ర చెంప దెబ్బ కొట్టింది! అని తెలివిగా సమాధానం ఇచ్చింది ప్రీతి జింతా. ఇది ఏ సినిమాలోనిది? చెంప దెబ్బ దేని కోసం? అంటే వివరంలోకి వెళ్లాలి.
ప్రీతి జింటా ఇటీవల తన ఎక్స్ ఖాతాలో అభిమానులతో మాట్లాడుతూ `కభీ అల్విదా నా కెహ్నా` (2006) చిత్రీకరణ సమయంలో షారూఖ్ చెంప దెబ్బ ఎపిసోడ్‌ని గుర్తు చేసుకుంది. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌ను చెంపదెబ్బ కొట్టాల్సిన సన్నివేశంలో తాను అతడిని కొట్టేందుకు సందేహించానని, అయితే షారూఖ్ తనకు తానుగానే సహజత్వం కోసం, సీన్ పండటం కోసం చెంప దెబ్బ కొట్టమని కోరాడని ప్రీతి వెల్లడించింది. ఆ సన్నివేశానికి ప్రామాణికత అవసరం.. ఇంపాక్ట్ పెంచడానికి ఖాన్ ఆ చెంపదెబ్బ నిజంగా పడాలని పట్టుబట్టారు. నేను వెంటనే SRKని చెంపదెబ్బ కొట్టాను. నిజానికి నేను అలా కొట్టాలనుకోలేదు. కానీ షారూఖ్ దానిని నిజం చేయాలని కోరాడు. అలాంటి అనుభవం అందమైనది కాదు! అని తెలిపింది.
ఒక ఔత్సాహిక అభిమాని షారుఖ్ ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే ఆనందించాడా? అని అడిగాడు. దీనికి ప్రతిస్పందనగా``లేదు! ఇది సరదా కోసం కాదు... అంతేకాకుండా, నేను అతడిని కావాలని ఎప్పుడూ చెంపదెబ్బ కొట్టను... రియా సరన్ అతడిని చెంపదెబ్బ కొట్టింది`` అని తెలిపింది. రియా సరన్ ఈ చిత్రంలో ప్రీతి జింటా పోషించిన పాత్ర. 2006లో విడుదలైన కభీ అల్విద నా కెహ్నా ప్రేమ, అపనమ్మకం, సంబంధాల నేపథ్యంలో ఎమోషనల్ డ్రామా. కాపురంలో కలతలు ఎదుర్కొనే యువతిగా ప్రీతి జింతా నటించగా, ఆమె భర్తగా షారూఖ్ నటించారు. ఈ చిత్రానికి కరణ్ జోహార్ దర్శకత్వం వహించారు. ప్రీతిజింతా- షారూఖ్‌లతో పాటు రాణి ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, అమితాబ్ బచ్చన్, కిరణ్ ఖేర్ తదితరులు నటించారు. రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే పెళ్లయిన జంటగా షారూఖ్ - ప్రీతి జింటా అద్భుతంగా నటించారు.