ముసలావిడతో దెబ్బలు.. డైరెక్టర్ నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి..!
ఐతే నటులకు ఈ సందర్భం ఎదురవడం చాలా కామన్ కాగా ఒక డైరెక్టర్ కి ఇలాంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది అని అసలు ఊహించి ఉండరు. ఒ
By: Tupaki Desk | 31 Dec 2024 4:12 AM GMTసినిమా ఇంకా సీరియల్స్ లో ప్రతినాయకుడి పాత్ర బాగా సక్సెస్ అయినప్పుడు అంటే సినిమా హిట్ లో ఆయన పాత్ర ఆయన క్రూరత్వం బాగా వర్క్ అవుట్ అయినప్పుడు అతను తెర మీద చేసిన నటనకు కొన్నిసార్లు బయట కూడా ఆ ఇంపాక్ట్ పడుతుంది. అందుకే సినిమాల్లో విలన్ గా చేసిన కొందరికి బయట ప్రేక్షకులు అతన్ని అసహ్యించుకోవడం లేదా దుర్భాషలాడటం చూస్తూనే ఉంటాం. ఐతే అదంతా డైరెక్టర్ కెమెరా రోలింగ్ నుంచి కట్ అయ్యే వరకు చేసే నటనే. కానీ తన పాత్ర ఇంతగా జనాల్లోకి వెళ్లినందుకు ఆ నటుడు కూడా చాలా హ్యపీగా ఫీల్ అవుతాడు.
ఐతే నటులకు ఈ సందర్భం ఎదురవడం చాలా కామన్ కాగా ఒక డైరెక్టర్ కి ఇలాంటి ఒక పరిస్థితి ఎదురవుతుంది అని అసలు ఊహించి ఉండరు. ఒక సూపర్ హిట్ సినిమా తీసిన దర్శకుడు ఆ కథలో హీరో హీరోయిన్లను విడగొడతాడు. అందుకు ఆ సినిమా హిట్ అయినా ఒక మహిళా అభిమాని అది కూడా ఒక ముసలావిడ ఆ దర్శకుడిని పిలిచి మరీ కొట్టిందట. ఆ తర్వాత వాళ్లిద్దరినీ ఎందుకు కలపలేదు అన్నదట.
ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే 2018 లో వచ్చిన 96 సినిమా సంగతి ఇది. ప్రేమ్ కుమార్ డైరెక్షన్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన సినిమా 96. ప్రేమకథల్లో ఇదొక స్పెషల్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో రామ్, జానులు ప్రేమించుకుంటారు కానీ విడిపోతారు. జాను ఆలోచనలతో రామ్ పెళ్లి చేసుకోకుండా ఉంటాడు. ఐతే కొన్నాళ్లకు గెట్ టు గెదర్ పెట్టినప్పుడు రామ్, జాను కలుస్తారు. అలా వారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్తారు.
ఈ కథను చాలా అందంగా తెరకెక్కించాడు డైరెక్టర్ ప్రేమ్ కుమార్. ఐతే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా దీన్ని తెలుగులో జానుగా తెరకెక్కించారు. శర్వానంద్, సమంత కలిసి నటించిన ఈ సినిమా తెలుగులో అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయ్యాక ఒకసారి బయటకు వెళ్లిన ప్రేమ్ కుమార్ కి ఒక ముసలావిడ అతన్ని గుర్తు పట్టి పిలిచి మరీ కొట్టిందట. దానికి కారణం రామ్, జానులను ఎందుకు కలపలేదని అన్నదట. ఆ తర్వాత ఆమె ముద్దు కూడా పెట్టిందని అని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ప్రేం కుమార్.
96 తర్వాత మళ్లీ ఆరేళ్లకు మేయలగన్ సినిమా చేశారు ప్రేం కుమార్. ఆ సినిమాను తెలుగులో సత్యం సుందరంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఐతే రీసెంట్ ఇంటర్వ్యూలో 96 సీక్వెల్ సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించారు డైరెక్టర్ ప్రేమ్ కుమార్.