ప్రేమలు ట్రైలర్ టాక్.. కుమారి ఆంటీని కూడా వదల్లేదుగా..!
మలయాళంలో ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజైన ప్రేమలు సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది
By: Tupaki Desk | 3 March 2024 6:18 AMమలయాళంలో ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజైన ప్రేమలు సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. గిరీష్ ఏడి డైరెక్ట్ చేసిన ఈ యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ సినిమా లో నెస్లన్, మమిత జోడీగా నటించారు. సినిమాలో అఖిల భార్గవన్, అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ తదితరులు నటించారు. మలయాళంలో లేటెస్ట్ సెన్సేషన్ గా మారిన ఈ సినిమా 5 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కించగా అక్కడ 50 కోట్ల పైన వసూళ్లతో దూసుకెళ్తుంది.
సౌత్ ఇండస్ట్రీ అంతా షాక్ అయ్యేలా ప్రేమలు సినిమా సంచలనం సృష్టిస్తుండగా ఇప్పుడు ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ప్రేమలు తెలుగు వెర్షన్ ను రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేస్తున్నాడు. మార్చి 8న తెలుగు ప్రేమలు రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే రెగ్యులర్ లవ్ స్టోరీగానే అనిపిస్తున్నా సినిమా ఆద్యంతం ఎంటర్టైనింగ్ గా ఉంటుందని అనిపిస్తుంది.
సినిమా మొత్తం హైదరాబాద్ లో తెరకెక్కించడం వల్ల తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు. ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. మరి ఈ మలయాళ ప్రేమకథ తెలుగు ఆడియన్స్ ని ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. ట్రైలర్ లో ఆర్.ఆర్.ఆర్ పాపులర్ డైలాగ్ తొక్కుకుంటూ పోవాలేతో పాటుగా కుమారి ఆంటీని కూడా వాడుకున్నారు.
ప్రేమలు తెలుగు ట్రైలర్ ఆకట్టుకోగా.. సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాను ఫాహద్ ఫాజిల్. దిఒలేష్ పోతన్, శ్యాం పుష్కరన్ నిర్మించగా తెలుగులో కార్తికేయ రిలీజ్ చేస్తున్నారు. మార్చి 8 శివరాత్రి సందర్భంగా తెలుగులో విశ్వక్ సేన్ గామి, గోపీచంద్ భీమా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ రెండు సినిమాల మధ్య ప్రేమలు ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి. ఆల్రెడీ మలయాళంలో హిట్ అయ్యింది కాబట్టి యూత్ కనెక్ట్ అయితే మాత్రం సినిమాకు మంచి వసూళ్లే వచ్చే ఛాన్స్ ఉంది.
తెలుగులో లవ్ స్టోరీస్ కి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుంది. అయితే ప్రేమలు తెలుగులో ఇప్పటివరకు రానటువంటి కొత్త ప్రేమ కథ ఏమి కాదు కానీ సినిమా మొత్తం ఎంటర్టైనింగ్ తో నడిపించారని తెలుస్తుంది. మలయాళంలో ఇలాంటివి కొత్త కాబట్టి అక్కడ ఈ సినిమా రికార్డులు సృష్టించింది. మరి తెలుగు ఆడియన్స్ ప్రేమలు సినిమాకు ఎన్ని మార్కులు వేస్తారన్నది చూడాలి.