సంతోష్ శోభన్ ప్రేమ్ కుమార్ టాక్ ఏంటి..?
ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ్ కుమార్ ఎలా ఉంది. అసలు ఈ ప్రేమ్ కుమార్ కథ కామీషు ఏంటన్నది ఓ లుక్కేద్దాం.
By: Tupaki Desk | 18 Aug 2023 12:16 PM GMTయువ హీరోల్లో సక్సెస్ కోసం విక్రమార్కుడిలా ప్రయత్నిస్తున్న సంతోష్ శోభన్ విజయాన్ని అందుకోవడంలో మాత్రం వెనకపడుతున్నాడు. స్మమర్ లో వచ్చిన అన్నీ మంచి శకునములే సినిమా కూడా నిరాశపరచగా లేటెస్ట్ గా ప్రేమ్ కుమార్ అంటూ మరో సినిమాతో వచ్చాడు. అభిషేక్ మహర్షి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన రాశి సింగ్ హీరోయిన్ గా నటించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ప్రేమ్ కుమార్ ఎలా ఉంది. అసలు ఈ ప్రేమ్ కుమార్ కథ కామీషు ఏంటన్నది ఓ లుక్కేద్దాం.
ప్రేమ్ కుమార్ అలియాస్ పీకే (సంతోష్ శోభన్) ఓ వెడ్డింగ్ డిటెక్టివ్ తన స్నేహితుడు సుందర్ లింగం (కృష్ణ తేజ) తో కలిసి పెళ్లిల్లు చెడగొడుతూ డబ్బులు సంపాదిస్తుంటాడు. ప్రేమ్ కుమార్ కి కూడా అలాంటి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే నేత్ర (రాశి సింగ్) తాళి కట్టే టైం లో రైజింగ్ స్టార్ రోషన్ (కృష్ణ చైతన్య) మండపంలోకి వచ్చి నేత్రని ప్రేమిస్తున్నానని సినిమా ఫక్కీలో పెళ్లి ఆగిపోయేలా చేస్తాడు. నేత్రతో కాకుండానే ప్రేమ్ కుమార్ కి పెళ్లి మండపం దాకా వచ్చి ఆగిపోతుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ప్రేమ్ కుమార్ కి పెళ్లి కాదు. రోషన్ నేత్రని కాకుండా అంగన అనే అమ్మాయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఇంతకీ ప్రేమ్ కుమార్ కి పెళ్లైందా.. అతను ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అన్నదే సినిమా కథ.
చాలా సినిమాల్లో క్లైమాక్స్ లో హీరో వచ్చి ఫైట్ చేసి హీరోయిన్ చేయి పట్టుకుని వెళ్లిపోతాడు. కానీ అది పెళ్లి కొడుకు విషయంలో జరిగితే ఏమవుతుంది అనుకునే యాంగిల్ లో కథ చెప్పాడు డైరెక్టర్. ఆసక్తికరమైన కాన్సెప్ట్ అయినా దాన్ని తెర మీద తీసుకురావడంలో విఫలమయ్యాడు. కొన్ని ఎపిసోడ్స్ ఫన్నీగా అనిపించినా బలమైన అంశాలు లేకపోవడం సినిమాకు మైనస్ అయ్యింది.
డిటెక్టివ్ హీరో పెళ్లిల్లు చెడగొట్టే తీరు కూడా ప్రేక్షకులకు ఎంగేజ్ అవదు. ఫస్ట్ హాఫ్ ఏదో కామెడీ పర్వాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ గందరగోళంగా అనిపిస్తాయి. కొన్ని అంశాలు దర్శకుడి ప్రతిభ కనబరచేలా చేసినా ఇంకాస్త జాగ్రత్త పడి ఉంటే సినిమా వేరేలా ఉండేదని అనిపిస్తుంది.
సంతోష్ శోభన్ తన పాత్రకి తగినట్టుగా నటించాడు. రాశి సింగ్, రుచిత పాత్రలకు వారిద్దరు పర్వాలేదు అనిపించారు. సుందర్శన్, కృష్ణ తేజ నవ్వించే ప్రయత్నం చేశారు. కథా నేపథ్యం తో పాటుగా పతాక సన్నివేశాలు కొద్దిగా బెటర్ అనిపిస్తాయి. అయితే ప్రేమ్ కుమార్ ఎంటర్టైనర్ సినిమాగా రాగా అందులో ఫన్ తక్కువైనట్టు అనిపిస్తుంది. అంతేకాదు ఎమోషనల్ సీన్స్ కూడా మెప్పించలేదు. టీజర్, ట్రైలర్ లో ఎంటర్టైనర్ గా అనిపించిన ప్రేమ్ కుమార్ సినిమాకు వచ్చిన ఆడియన్స్ ని మెప్పించడంలో మాత్రం విఫలమయ్యాడు.