బిగ్ బాస్ 8 : ప్రేరణ పంటపండింది.. నక్కతోక తొక్కిన నబీల్..!
విష్ణు ప్రియని హౌస్ క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పినందుకు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అని ప్రేరణకి సమాధానం చెప్పింది.
By: Tupaki Desk | 9 Nov 2024 4:12 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో 11వ వారం మెగా చీఫ్ గా ప్రేరణ గెలిచింది. మూటల టాస్క్ లో చివరి దాకా ప్రేరణ, రోహిణి ఉండగా హౌస్ మెట్స్ ఎక్కువ మంది ప్రేరణకి సపోర్ట్ చేశారు. సో అలా ప్రేరణ మెగా చీఫ్ గా నిలిచింది. ప్రేరణ మెగా చీఫ్ అవ్వడమే ఆలస్యం విష్ణు ప్రియతో వాదన మొదలైంది. విష్ణు ప్రియని హౌస్ క్లీన్ గా ఉంచుకోవాలని చెప్పినందుకు నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా అని ప్రేరణకి సమాధానం చెప్పింది.
ఇక మరోపక్క శుక్రవారం ఎవిక్షన్ షీల్డ్ టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. పాము బుస కొట్టిన ప్రతిసారి బిగ్ బాస్ పిలిచిన ఇద్దరు వెళ్లి దాని నోట్లో హౌస్ మెట్ ఫోటో ఉన్న గుడ్డుని వేయాల్సి ఉంటుంది. అలా చివరి దాకా ఎవరి గుడ్డైతే ఉంటుందో వారే ఎవిక్షన్ షీల్డ్ పొందుతారు. ఐతే ప్రేరణ మెగా చీఫ్ అయినందుకు ఆమె ఫస్ట్ ఐదుగురి గుడ్లను పావు నోట్లో వేయాల్సి ఉంటుంది. ప్రేరణ విష్ణు ప్రియ, గంగవ్వ, హరితేజ, పృధ్వి, గౌతం ల గుడ్లను పాము నోట్లో వేసింది.
ఇక ఆ తర్వాత నిఖిల్, గౌతంలు తేజాది.. విష్ణు ప్రియ, పృధ్విలు కలిసి ప్రేరణాది, హరితేజ, రోహిణి కలిసి అవినాష్ ది, అవినాష్, నబీల్ కలిసి యష్మిది వేశారు. చివరగా యష్మి, తేజలు నిఖిల్, రోహిణి, నబీల్ గుడ్ల లోంచి ఒకటి వేయాల్సి ఉంది. కానీ వారిద్దరు ఎంత సేపటికి ఒక నిర్ణయానికి రాలేదు. యష్మి రోహిణిది వేయాలని అంటుండగా.. తేజ నిఖిల్ ది వేయాలని పట్టుబట్టాడు. తేజ యష్మి ఓకే అనకముందే నిఖిల్ ది పాము నోట్లో వేశాడు. యష్మి కూడా రోహిణి బొమ్మ ఉన్న గుడ్డుని పాము నోట్లో వేసింది.
అలా చివరి వరకు నబీల్ ఫోటో ఉన్న గుడ్డు ఎవరు టచ్ చేయలేదు. అందుకే నబీల్ ఎవిక్షన్ షీల్డ్ గెలిచాడు. ఐతే అది తనకు వచ్చింది మాత్రం మిగతా హౌస్ మెట్స్ వల్ల అనే చెప్పొచ్చు. ఎవిక్షన్ షీల్డ్ నబీల్ కి అవసరం అవుతుందా ఈసారి ఎవిక్షన్ షీల్డ్ సీజన్ మొత్తం ఉపయోగపడేలా ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చే వారం ఫ్యామిలీ వీక్ అని తెలుస్తుంది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో నిఖిల్, గౌతం, యష్మి, ప్రేరణ, హరితేజ, పృధ్వి, విష్ణు ప్రియ ఉన్నారు. వారిలో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవుతారన్నది చూడాలి.