బిగ్ బాస్ 8 : హౌస్ లో పుష్ప 2 హంగామా.. ప్రేరణకు లక్కీ ఛాన్స్..!
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం రెగ్యులర్ వారాల్లా కాకుండా కేవలం ఆడియన్స్ కి ఓటింగ్ రిక్వెస్ట్ ఇచ్చేందుకే టాస్క్ లు నడుస్తున్నాయి.
By: Tupaki Desk | 4 Dec 2024 6:10 AM GMTబిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం రెగ్యులర్ వారాల్లా కాకుండా కేవలం ఆడియన్స్ కి ఓటింగ్ రిక్వెస్ట్ ఇచ్చేందుకే టాస్క్ లు నడుస్తున్నాయి. ఈ టాస్క్ లో హౌస్ లో ఉన్న ఏడుగురిని ఇద్దరు చొప్పున జంటగా ఏర్పడమని బిగ్ బాస్ చెప్పాడు. ఈ క్రమంలో అవినాష్ ఒక్కడే ఒంటరి వాడయ్యాడు గౌతం తో నబీల్, విష్ణు ప్రియ రోహిణి, నిఖిల్ ప్రేరణ జంటలుగా మారారు. ఐతే ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసేందుకు ఇచ్చిన టాస్క్ లో రెండిటిలో నిఖిల్ ప్రేరణ జంట గెలిచింది. ఫైనల్ గా ప్రేరణ ఆ ఛాన్స్ అందుకుంది.
ఇక తన ఆట గురించి తన గురించి మాట్లాడిన ప్రేరణ ఇక్కడ దాకా సపోర్ట్ చేసినందుకు థాంక్స్ కొన్ని మైనస్ లను మార్చుకుంటున్నా ఇంకా మీ సపోర్ట్ కావాలని అడిగింది. ఇక తర్వాత హౌస్ లో పుష్ప 2 హంగామా మొదలైంది. గురువారం రిలీజ్ అవుతున్న పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా పీలింగ్స్ సాంగ్ వీడియో ప్లే చేశారు. ఆ టైం లోనే ఆ సాంగ్ డ్యాన్స్ కంపోజర్ శేఖర్ మాస్టర్ హౌజ్ లోకి వచ్చాడు.
శేఖర్ మాస్టర్ హౌస్ మేట్స్ తో ఒక టాస్క్ ఆడించాడు. హౌస్ మేట్స్ తో కలిసి పీలింగ్స్ సాంగ్ డ్యాన్స్ చేయించాడు. పుష్ప 2 సాంగ్ జోష్ తో హౌస్ మేట్స్ కూడా సూపర్ థ్రిల్ అయ్యారు. ఇక తమ మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేసేలా గౌతం ఇన్ షియేట్ తీసుకుని నిఖిల్ కు క్షమాపణలు చెప్పాడు. నిఖిల్ కూడా గౌతం కు సారీ చెప్పి ఇద్దరు కలిసిపోయారు.
బిగ్ బాస్ సీజన్ 8 లో ఈ వారం మొత్తం కంటెస్టెంట్స్ ఆడియన్స్ ని ఓటింగ్ రిక్వెస్ట్ కోసమే టాస్క్ లు నడిపించేలా ఉన్నారు. ఇక టైటిల్ రేసులో ఉన్న నిఖిల్, గౌతం ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తుంది. ఇద్దరిలో ఎవరు టైటిల్ విజేత అవుతారన్నది నెక్స్ట్ వీక్ తెలుస్తుంది. ఇక ఈ వారం ఒకరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయితే టాప్ 6 గా ఎవరు నిలుస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్న ఆరుగురిలో ముగ్గురు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. రోహిణి ఈ సీజన్ మొత్తంలో మొదటిసారి నామినేట్ కాగా ఆమె టాప్ 6కి వెళ్తుందా లేదా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.