Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఇంట్లో ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్!

తాజాగా నెట్టింట ఆ సెల‌బ్రేషన్ కిచెందిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అందులో చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్ దంప‌తులుతో పాటు మొత్తం కుటుంబ స‌భ్యులంతా క‌నిపిస్తున్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 8:39 AM GMT
మెగాస్టార్ ఇంట్లో ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్!
X

మెగావార‌సుడు వ‌రుణ్ తేజ్-న‌టి లావాణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఘ‌నంగా పెద్ద‌ల స‌మ‌క్షంలో ఎంగేజ్ మెంట్ కార్య‌క్ర‌మం ముగించారు. ఇక వ‌రుణ్ .. లావ‌ణ్య మెడ‌లో మూడు ముళ్లు వేసి..ఏడు అడుగులు వేయ‌డమే ఆల‌స్యం. ఇప్ప‌టికే పెళ్లి ప‌నులు కూడా ప్రారంభ మైపోయాయి. ఫ్ర‌ఖ్యాత ఫ్యాష‌నిస్ట్ మ‌నీష్ మ‌ల్హోత్రా స్టోర్ నుంచి పెళ్లికి కావాల్సిన దుస్తుల‌న్నింటిని స్వ‌యంగా వ‌రుణ్‌- లావ‌ణ్య కొనుగోలు చేసారు.


మరోవైపు వెడ్డింగ్ కార్డు ఎలాంటి డిజైన్ తో ఉండాలి? ఎంత మందిని వివాహానికి ఆహ్వానించాలి? వంటి చ‌ర్చ‌లు కుటుంబ స‌భ్యుల్లో జోరుగా సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లైపోయిన‌ట్లు తెలుస్తోంది. నేరుగా మెగాస్టార్ చిరంజీవి ఇల్లు అందుకు వేదికైన‌ట్లు తెలుస్తుంది. ప్రీ వెడ్డింగ్ సెల‌బ్రేష‌న్ ని కాబోయే దంప‌తులతో పాటు ఫ్యామీలీ అంతా ఆస్వాదిస్తుంది.


చిరంజీవి ఇంట్లో కుటుంబ స‌భ్యులంతా గేద‌ర్ అయ్యారు. వాళ్ల‌తో పాటు వ‌రుణ్ తేజ్-లావ‌ణ్య లు కూడా ఉన్నారు. తాజాగా నెట్టింట ఆ సెల‌బ్రేషన్ కిచెందిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. అందులో చిరంజీవి..రామ్ చ‌ర‌ణ్ దంప‌తులుతో పాటు మొత్తం కుటుంబ స‌భ్యులంతా క‌నిపిస్తున్నారు. చిరంజీవి తోబుట్టువులు...మేన‌ల్లుళ్లు..మ‌న‌వ‌లు..మ‌న‌వ‌రాళ్లు మొత్తం అంతా వ‌రుణ ప్రీ వెడ్డింగ్ ని గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ వెంట్ చిరంజీవి ఏర్పాటు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆయ‌నే స్వ‌యంగా నాగ‌బాబు దంపతుల్ని..వ‌రుణ్ -లావ‌ణ్య‌ల్ని ఇంటికి ఆహ్వానించి ఈ ర‌క‌మైన స‌ర్ ప్రైజ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. చిరంజీవికి వ‌రుణ్ తేజ్ అంటే ఎంతో ఇష్టం. చిన్న‌ప్ప‌టి నుంచి చిరంజీవి గారంతో పెరిగాడు. ఆర‌డుగులు ఎత్తున్నా..నాకింకా చిన్నపిల్లాడివిరా అంటూ చిరు ఇప్ప‌టికీ ఆట‌ప‌ట్టిస్తుంటారు. వ‌రుణ్ తేజ్ మెహ‌మాటాన్ని ఆస‌ర‌గా చేసుకుని ఇంకా ఆటాడేస్తుంటారు. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే అన్ని తెలుస్తున్నాయి గానీ...పెళ్లి తేది ఎప్పుడ‌న్న‌ది? మాత్రం మెగా ఫ్యామిలీ ఇంకా రివీల్ చేయ‌లేదు. ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ అంటున్నారు. మ‌రి అందులో వాస్త‌వం ఎంతో తెలియాలి.