Begin typing your search above and press return to search.

మాజీ ప్రియుడి గురించి పీసీ బ‌హిరంగంగా

ప్రియాంక చోప్రా బాలీవుడ్ వ‌దిలి వెళ్లిపోవ‌డానికి కార‌ణం గౌరీఖాన్ స‌న్నిహితుడు క‌ర‌ణ్ జోహార్ అని క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప‌లు సంద‌ర్భాల్లో వాదించారు.

By:  Tupaki Desk   |   11 Jan 2025 11:30 PM GMT
మాజీ ప్రియుడి గురించి పీసీ బ‌హిరంగంగా
X

ఇండ‌స్ట్రీ ఔట్‌ సైడ‌ర్ ప్రియాంక చోప్రా ఒక న‌టిగా ఎంతో సాధించింది. గ్లోబల్ స్టార్‌గా ఎంద‌రికో స్ఫూర్తి. బాలీవుడ్ టు హాలీవుడ్ పీసీ ప్ర‌యాణం, విజ‌యాల గురించి ప్ర‌జ‌ల‌కు తెలుసు. ప్ర‌పంచ సుంద‌రిగా కిరీటం గెలుచుకున్న ప్రియాంక చోప్రా, బాలీవుడ్ అగ్ర‌ క‌థానాయిక‌గా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించింది.

అయితే కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ తో పీసీ ప్రేమాయ‌ణం నిజంగా త‌న కెరీర్ ని నాశ‌నం చేసింద‌ని చాలా ప్ర‌చారం ఉంది. షారూఖ్ తో డాన్ 2 స‌మ‌యంలో ఎంతో స‌న్నిహితంగా మారిన ప్రియాంక చోప్రాను గౌరీఖాన్ సైతం హెచ్చ‌రించింద‌ని, త‌న భ‌ర్త‌కు దూరంగా పెట్టేందుకు ప్ర‌య‌త్నించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. షారూఖ్ తో పీసీ చ‌నువును గౌరీఖాన్ అస్స‌లు స‌హించ‌లేక‌పోయింద‌ని, ఆ త‌ర్వాత ప‌రిణామాలు వేగంగా మారిపోయాయ‌ని, ఉన్న‌ట్టుండి స‌డెన్ గా పీసీ కెరీర్ డౌన్ ఫాల్ అవ్వ‌డం, దేశం విడిచి వెళ్లిపోవాల‌నుకోవ‌డం లాంటి విష‌యాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి.

ప్రియాంక చోప్రా బాలీవుడ్ వ‌దిలి వెళ్లిపోవ‌డానికి కార‌ణం గౌరీఖాన్ స‌న్నిహితుడు క‌ర‌ణ్ జోహార్ అని క్వీన్ కంగ‌న ర‌నౌత్ ప‌లు సంద‌ర్భాల్లో వాదించారు. మాఫియా పీసీని బెదిరించింద‌ని కంగ‌న బ‌హిరంగ వేదిక‌పైనే విమర్శించింది.

ఇదిలా ఉంటే, ప్రియాంక చోప్రా ఇటీవల షారుఖ్ ఖాన్ తో పాత రిలేష‌న్ పై ఊహాగానాలను మ‌రోసారి ర‌గిలించింది. తాను ఎంతగానో ఇష్టపడే లెదర్ జాకెట్ గురించి చెబుతూ అది తన 'మాజీ బాయ్ ఫ్రెండ్స్'లో ఒకరికి చెందినదని చెప్పింది. 'డర్టీ లాండ్రీ' అనే టాక్ షోలో మాట్లాడుతూ.. ఆ జాకెట్‌ను తన 'ఎయిర్ పోర్ట్ జాకెట్'గా అభివర్ణించింది. అయితే ఇంత‌లోనే నెటిజ‌నులు పీసీ లెద‌ర్ జాకెట్ తో పాటు, షారూఖ్ ధ‌రించిన లెద‌ర్ జాకెట్ ఫోటోని జోడించి వైర‌ల్ చేయ‌డం ప్రారంభించారు. ఆ ఇద్ద‌రి మధ్యా పాత ఎఫైర్ గురించి తిరిగి ప్ర‌చారం మొద‌లైంది. నేరుగా ఖాన్ పేరు చెప్ప‌క‌పోయినా కానీ నెటిజ‌నులు చాలా వేగంగా పీసీ మాజీ ఎవ‌రో క‌నిపెట్టేసారు.