Begin typing your search above and press return to search.

ట్రోల్స్‌ వేధింపులు.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించిన పృథ్వీ!

ఒక సినిమా ప్రమోషన్ ఈ స్థాయిలో పొలిటికల్‌గా మారిపోవడం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

By:  Tupaki Desk   |   12 Feb 2025 3:18 PM GMT
ట్రోల్స్‌ వేధింపులు.. సైబర్ పోలీసుల్ని ఆశ్రయించిన పృథ్వీ!
X

'లైలా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులు అతని మాటలను తప్పుబడుతూ పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. దీంతో #BoycottLaila అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ ఈ స్థాయిలో పొలిటికల్‌గా మారిపోవడం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

ఈ వివాదం మొదలైనప్పటి నుంచి పృథ్వీ రాజ్‌పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఈ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని, ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. హాస్పిటల్ బెడ్ పై నుంచే ఆయన వైసీపీ సోషల్ మీడియా వింగ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “అందరూ సినిమాను సినిమాగా చూడాలి. 11 అనే మాటకు ఇంత రియాక్షన్ ఎందుకు? మా అమ్మ, భార్య, పిల్లలపై దుర్భాషలాడుతున్నారు. ఈ వేధింపులు తాళలేక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది” అంటూ తన బాధను పంచుకున్నారు.

తాజాగా పృథ్వీ రాజ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఆయన.. తన ఫోన్ నెంబర్‌ను సోషల్ మీడియాలో లీక్ చేసి తనను వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. “నా నెంబర్‌ను ఓ గ్రూప్‌లో ఉంచి దాదాపు 1800 కాల్స్ వచ్చాయి. కుటుంబ సభ్యులను దూషించారు. మానసికంగా భయాందోళనకు గురయ్యాను” అని చెప్పారు. ఈ దాడుల వెనుక వైసీపీ సోషల్ మీడియా వింగ్ ఉందని, దీనిపై ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

“ఒక వ్యక్తి అనిల్ పేరుతో పోస్టులు పెట్టి నా నెంబర్ వైరల్ చేశాడు. ఆ వ్యక్తిపై కేసు నమోదు చేయాలని పోలీసులను కోరాను. త్వరలో ఏపీ హోం మంత్రిని కూడా కలిసి ఫిర్యాదు చేయనున్నాను. నన్ను వేధించిన వారిపై కోటి రూపాయల పరువు నష్టం దావా వేస్తాను” అని పృథ్వీ రాజ్ పేర్కొన్నారు. రాజకీయ వ్యాఖ్యలు చేయాలని తన ఉద్దేశం కాదని, అవి కేవలం తన క్యారెక్టర్‌కు సంబంధించిన విషయాలు మాత్రమేనని తెలిపారు. అయితే సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్ర స్థాయికి చేరడంతో తన కుటుంబం క్షోభ అనుభవించాల్సి వచ్చిందని ఆయన వాపోయారు.

పృథ్వి చర్యకు వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక విశ్వక్ సేన్ కూడా ఇదివరకే ఈ వివాదంపై ఒక క్లారిటీ ఇచ్చాడు.. “సినిమాకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి బాయ్‌కాట్ ట్రెండ్ చేయడం బాధ కలిగించే విషయం. మేమంతా ఎంతో కష్టపడి పని చేస్తున్నాం. దయచేసి సినిమాను సినిమా కోణంలోనే చూడాలి” అంటూ విజ్ఞప్తి చేశారు. లైలా సినిమా మీద ప్రభావం పడకుండా చూడాలని విశ్వక్ కోరారు.

ఈ వివాదం మరింత ముదరుతుందా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. లైలా ఫిబ్రవరి 14న విడుదల కానుండటంతో, ఈ వివాదం సినిమా కలెక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియాల్సి ఉంది. పృథ్వీ రాజ్ లీగల్ యాక్షన్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో అతనిపై జరుగుతున్న ట్రోలింగ్ తగ్గుతుందా? లేక మరింత రచ్చ జరుగుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.

‘లైలా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ రాజ్ చేసిన కామెంట్స్ వివాదంగా మారిన విషయం తెలిసిందే. సినిమా ప్రమోషన్‌లో భాగంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభిమానులు అతని మాటలను తప్పుబడుతూ పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు. దీంతో #BoycottLaila అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. ఒక సినిమా ప్రమోషన్ ఈ స్థాయిలో పొలిటికల్‌గా మారిపోవడం సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.