హిట్ మూవీ సీక్వెల్ కు బిజినెస్ కష్టాలు!
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ కు ఎల్2 ప్రమోషన్స్ గురించి పట్టించుకునే తీరిక లేకపోవడంతో భారమంతా నిర్మాతల మీదే పడింది.
By: Tupaki Desk | 13 March 2025 12:00 AM ISTమలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, సినిమాలకు దర్శకత్వం కూడా వహిస్తాడనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన మోహన్ లాల్ తో చేసిన లూసీఫర్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా ఎల్2: ఎంపురాన్ వస్తోంది.
మార్చి 27న రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటివరకు మొదలవక పోవడంతో మోహన్ లాల్ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. మిగిలిన భాషల సంగతి పక్కన పెడితే ఒరిజినల్ వెర్షన్ మలయాళంలో కూడా ఎల్2: ఎంపురాన్‌కు ప్రమోషన్స్ మొదలవకపోవడం చూసి ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో బిజీగా ఉన్న పృథ్వీరాజ్ కు ఎల్2 ప్రమోషన్స్ గురించి పట్టించుకునే తీరిక లేకపోవడంతో భారమంతా నిర్మాతల మీదే పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ఇంకా మొదలుపెట్టకపోవడానికి కారణం సినిమాకు బిజినెస్ జరగకపోవడమేనని సమాచారం.
నిర్మాతలు చెప్తున్న రేటుకి, ఓటీటీ సంస్థలు కోట్ చేస్తున్న రేటుకీ భారీ తేడా ఉండటం వల్లే బిజినెస్ అవడం లేదని తెలుస్తోంది. దానికి తోడు ఎల్2 నిర్మాణ సంస్థ లైకా కావడంతో వారి గత సినిమాలకు సంబంధించిన లావాదేవీలు పెండింగ్ ఉన్నాయట. దీంతో బయ్యర్లు సరిగా రెస్పాండ్ అవడం లేదని, ఈ నేపథ్యంలో థియేటర్ల అగ్రిమెంట్ విషయంలో లేటవుతుందని తెలుస్తోంది.
ఈ లేట్ వల్లే తెలుగు రాష్ట్రాలతో పాటూ తమిళనాడు, కర్ణాటకలో కూడా ఎక్కువ స్క్రీన్లు రాబిన్‌హుడ్, మ్యాడ్ స్క్వేర్, విక్రమ్ వీర ధీర శూర్2 లు లాక్ చేసుకుంటున్నాయని తెలుస్తోంది. మరి ఇలాంటి సిట్యుయేషన్స్ లో ఎల్2 చెప్పిన డేట్ కు వస్తుందా అంటే అందులో ఎలాంటి అనుమానం పన్లేదంటున్నారు. ఏదైనా ఒక హిట్ సినిమా సీక్వెల్ రిలీజ్ కు ఇలాంటి సిట్యుయేషన్స్ ఎదురవడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.