పృథ్వీరాజ్‌కు అంత టాలెంట్ ఉందా అన్నారు
నిర్మాత డైరెక్టర్ ను నమ్మి ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనిస్తే మంచి సినిమాలొస్తాయి.
By: Tupaki Desk | 19 March 2025 1:00 AM ISTనిర్మాత డైరెక్టర్ ను నమ్మి ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా పూర్తి స్వేచ్ఛనిస్తే మంచి సినిమాలొస్తాయి. అయితే అలా అని ఎక్కువగా నమ్మి ఓవర్ గా ఖర్చు పెడితే నష్టాలు కూడా వచ్చే ఛాన్సుంది. మరీ ముఖ్యంగా కొత్త డైరెక్టర్లతో ఎక్కువ బడ్జెట్ పెట్టి సినిమా చేస్తే నష్టాలొచ్చే అవకాశమే ఎక్కువ ఉంటుంది. అందుకే కొత్త డైరెక్టర్లంటే ఏ నిర్మాతలైనా ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంటారు.
కానీ లూసీఫర్ నిర్మాత ఆంటోనీ పెరంబవూర్ తనపై ఎంతో నమ్మకం ఉంచారని ఆ చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ అన్నారు. లూసీఫర్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఎల్2: ఎంపురాన్ సినిమా మార్చి 27న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా పలు విషయాలను తెలియచేస్తూ సినిమాపై హైప్ ను పెంచుతుంది.
లూసిఫర్ సినిమా చేస్తున్నప్పుడు మలయాళంలోనే ఎవరూ చేయని భారీ ప్రయత్నాన్ని తాము చేశామని పృథ్వీరాజ్ అన్నాడు. లూసిఫర్ మూవీని అనౌన్స్ చేయగానే నిర్మాత ఆంటోనీకి ఎంతోమంది ఫోన్స్ చేయడం మొదలుపెట్టారని, ఇప్పటివరకు ఎవరూ చేయనంత బడ్జెట్ తో పృథ్వీతో సినిమా ఎలా చేస్తున్నావు? అతనికి అంత టాలెంట్ ఉందా అని అడిగే వారని పృథ్వీరాజ్ చెప్పాడు.
మలయళ ఇండస్ట్రీలో తన గురించి చాలా మంది అలా మాట్లాడుకోవడం విన్నానని, వాస్తవానికి అంత బడ్జెట్ లో సినిమా ఆ టైమ్ లో రిస్కేనని, కానీ నిర్మాత ఆంటోనీ, హీరో మోహన్ లాల్ తనపై పెట్టుకున్న నమ్మకం తనను ఎంతో ఇన్‌స్పైర్ చేసిందని, షూటింగ్ టైమ్ లో కూడా ఎక్కడా నిర్మాత తనపై నమ్మకాన్ని పోగొట్టుకోలేదని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చాడు.
మూవీలో క్లైమాక్స్ సీన్ ను దుబాయ్ లో తీయాలనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ లో పర్మిషన్ రిజెక్ట్ అవడంతో ఏం చేయాలో తెలియలేదని, మూవీ రిలీజ్ డేట్ ను అప్పటికే అనౌన్స్ చేయడంతో ఏం పాలు పోలేదని, తర్వాత ఏ దారులున్నాయని ఆలోచిస్తే రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ గురించి తన ఫ్రెండ్ చెప్పడంతో వెంటనే అక్కడికి బయల్దేరానని చెప్పాడు. తాను వెళ్లేముందు "నేను రష్యా వెళ్తున్నా. రెండ్రోజుల్లో మీకు ఫోన్ చేస్తా. నేను ఓకే చెప్తే మీరు వెంటనే వచ్చేయండని" చెప్పానని, అక్కడి షూటింగ్ పర్మిషన్స్ విషయంలో మినిస్టర్ ఎంఏ బేబీ తమకెంతో సాయం చేశారని, రష్యా వెళ్లేటప్పుడు నిర్మాత ఖర్చుల కోసం తన క్రెడిట్ కార్డు కూడా ఇచ్చారని, ఆయన తనపై పెట్టుకున్న నమ్మకం వెలకట్టలేనిదని పృథ్వీరాజ్ తెలిపాడు.