Begin typing your search above and press return to search.

సలార్‌@365... ఇది మామూలు రికార్డ్‌ కాదు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 6:36 AM GMT
సలార్‌@365... ఇది మామూలు రికార్డ్‌ కాదు
X

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాదాపు రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన సలార్ ఓటీటీలోనూ సంచలన రికార్డులను నమోదు చేసింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో మొదట స్ట్రీమింగ్ అయిన సలార్‌ సినిమా ఆ తర్వాత జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. సాధారణంగా ఒక్క ఓటీటీలో స్ట్రీమింగ్ అయితేనే రెండు మూడు వారాల పాటు ట్రెండ్‌ కావడం కష్టం. అలాంటిది ఈ సినిమా ఏకంగా 365 రోజులుగా ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

ఇది సరికొత్త రికార్డు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అద్భుతమైన రికార్డులను నమోదు చేసిన సలార్ సినిమా గురించి మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్‌ గొప్ప రికార్డులను సృష్టించడం సంతోషంగా ఉంది అన్నాడు. ఇలాంటి అద్భుతమైన జర్నీలో పాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు కృతజ్ఞతలు అన్నాడు. చిత్ర యూనిట్ సభ్యులకు, ప్రభాస్‌, దర్శకుడు ప్రశాంత్ నీల్‌ కి నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రస్తుతం ఆయన లూసిఫర్ సీక్వెల్‌ని రూపొందించే పనిలో బిజీగా ఉన్నారు. ఆయ నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్‌లాల్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద లూసిఫర్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సీక్వెల్ పై అంచనాలు అంతకు మించి ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద సలార్‌ సాధించిన విజయం సీక్వెల్ పై అంచనాలను మరింతగా పెంచుతున్నాయి. సలార్‌ 2 సినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిందని, ఈ సంవత్సరం చివర్లో మిగిలిన బ్యాలెన్స్ షూట్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.

వచ్చే ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం అందుతుంది. అతి త్వరలోనే సలార్ 2 సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్‌ మాట్లాడుతూ సలాడ్ 2 పై అంచనాలు పెంచే విధంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. మొదటి పార్ట్ తో పోలిస్తే రెండో పార్ట్ లో అందరి పాత్రలు మరింత బలంగా ఉంటాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.