Begin typing your search above and press return to search.

సరదాగా నటుడై.. స్టార్ గా ఎదిగి..!

తల్లిదండ్రులు చేసే పనిని వారసత్వంగా తీసుకుని చేస్తే అది సినిమా బాషలో మాత్రమే నెపొటిజం అంటారు.

By:  Tupaki Desk   |   16 Oct 2024 5:45 AM GMT
సరదాగా నటుడై.. స్టార్ గా ఎదిగి..!
X

తల్లిదండ్రులు చేసే పనిని వారసత్వంగా తీసుకుని చేస్తే అది సినిమా బాషలో మాత్రమే నెపొటిజం అంటారు. ఐతే అందులో సక్సెస్ అవ్వడం ఎంత కష్టం అన్నది అందరికీ తెలిసిందే. అవకాశం దక్కడం వరకు బాగానే వచ్చినా అది సక్సెస్ చేసుకుని స్టార్ గా నిలబడటం అనేది మాత్రం వారి వారి బలాల మీద ఆధారపడి ఉంటుంది. ఐతే సినీ నేపథ్యం ఉన్నా మొదట అసలు సినిమాల్లోకి వచ్చేందుకు నిరాకరించి ఆ తర్వాత అందులోనే స్టార్ గా ఎదిగిన ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాల్సిందే.

మలయాళంలో సినిమా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టాడు పృధ్విరాజ్ సుకుమారన్. తల్లి తండ్రి మల్లిక, పరమేశ్వరన్ సుకుమారన్ అన్నయ్య ఇంద్రజిత్, వదిన పూర్ణిమ ఇలా ఇంట్లో అందరు నటులుంటే సాధారణంగా ఎవరికైనా నటన మీద ఆసక్తి పెరుగుతుంది. కానీ పృధ్వి రాజ్ మాత్రం వేరే రంగంలో స్థిరపడాలని అనుకున్నారు. అందుకే ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లారు. ఐతే ఆ టైం లోనే డైరెక్టర్ రంజిత్ సినిమా ఆడిషన్ కు సంబంధించి పిలవడంతో సరదాగా వచ్చి స్క్రీన్ టెస్ట్ ఇచ్చాడు పృధ్వి రాజ్.

అలా ఆ సినిమా ఛాన్స్ అందుకున్నారు. పృద్విరాజ్ మొదట నటించిన సినిమా అదే నందనం. ఐతే ఆ సినిమా కొన్ని కారణాల వల్ల పృద్విరాజ్ రెండు సినిమాల తర్వాత రిలీజైంది. పృధ్విరాజ్ భార్య సుప్రియా మేనన్. జర్నలిస్ట్ అయిన ఆమెను ప్రేమించి పెళ్లాడారు పృధ్విరాజ్ సుకుమారన్. భార్య వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నా అని గర్వంగా చెబుతారు పృధ్విరాజ్. పృధ్విరాజ్, సుప్రియాలకు ఒక పాప ఉంది ఆమె పేరు అల్కృతా మేనన్ సుకుమారన్.

ఫస్ట్ సినిమా ఏదో అలా చేసినా సినిమాల మీద అంత ఇష్టం లేని పృధ్విరాజ్ కొత్తలో సెట్ లో ప్రతి ఒక్కరితో ఇదే చివరి సినిమా ఇది పూర్తయ్యాక ఆస్ట్రేలియా వెళ్తా అని చెప్పేవారట. ఐతే అలా అనుకుంటూనే సినిమాలు పూర్తి చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత సినిమానే తన ప్రపంచంగా మారింది. హీరోగానే కాదు పృధ్విరాజ్ డైరెక్టర్ గా కూడా తన సత్తా చాటుతున్నారు. లూసిఫర్, బ్రో డాడీ సినిమాలతో ఆయన తన దర్శకత్వ ప్రతిభ చాటారు. కేవలం యాక్టింగ్, డైరెక్షన్ మాత్రమేనా సింగర్ గా కూడా మెప్పించారు.

ప్రస్తుతం పృధ్విరాజ్ ఎల్ 2 ఎంపురన్ సినిమాలో నటిస్తున్నాడు పృధ్విరాజ్. పృధ్విరాజ్ ప్రాణం పెట్టి నటించిన సినిమా ఆడుజీవితం. ఈ సినిమా కోసం తన ఎన్నో ఏళ్ల ఎఫర్ట్ పెట్టారు పృధ్విరాజ్. ఆడుకీవితం కోసమే మెగాస్టార్ చిరంజీవి సైరా ఛాన్స్ వచ్చినా వదులుకున్నారు. లాస్ట్ ఇయర్ పృధ్విరాజ్ ప్రభాస్ తో సలార్ సినిమాలో నటించారు. సినిమాలో వరద రాజ మన్నార్ గా పృధ్విరాజ్ మెప్పించారు.

మలయాళ పరిశ్రమకు తన పరంగా కొత్త సినిమాలతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న పృధ్విరాజ్ సుకుమారన్ పుట్టినరోజు ఈరోజు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తూ ఆయన ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని ఎన్నో గొప్ప సినిమాలు భారతీయ చలన చిత్ర పరిశ్రమకు అందించాలని కోరుకుందాం.