మలయాళ ఇండస్ట్రీపై హిట్ ప్రెజర్
సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.
By: Tupaki Desk | 5 Feb 2025 9:30 PM GMTఓ వైపు నటుడిగా వరుసపెట్టి సినిమాలు చేస్తూనే మరోవైపు డైరెక్టర్ గా కూడా సినిమాలను రూపొందిస్తున్నాడు మలయాళ స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్. సలార్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.
అంతేకాదు, ఫ్యూచర్ లో తెలుగు హీరోలతో కూడా సినిమాలు చేస్తానని పృథ్వీ ఇప్పటికే హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ చేసిన లూసీఫర్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు లూసీఫర్ కు సీక్వెల్ గా ఎల్2 ఎంపురాన్ అనే సినిమాను తీసిన పృథ్వీ రాజ్ దాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాడు.
ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా పృథ్వీరాజ్ మలయాళ ఇండస్ట్రీ గురించి కామెంట్స్ చేశాడు. మలయాళ చిత్ర పరిశ్రమకు బాక్సాఫీస్ కలెక్షన్స్ చాలా ముఖ్యమని ఆయన అన్నాడు. మలయాళంలో సినిమాలకు ప్రాఫిట్స్ రావడానికి చాలా ప్రెజర్ ఉంటుందని, అంత ప్రెజర్ లో కూడా మలయాళం నుంచి చాలా గొప్ప సినిమాలొస్తున్నాయని ఆయన అన్నాడు.
మంచి కథతో సినిమా తీయకపోతే వాటికి సరైన ఆదరణ దక్కదని ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయని, గత కొంతకాలంగా ఆడియన్స్ సినిమాలో నటీనటులెవరు? డైరెక్టర్ ఎవరనే దానితో సంబంధం లేకుండా మంచి కంటెంట్ తో వస్తే ఆదరిస్తున్నారు. దానికి ఆడియన్స్ కు ముందుగా థాంక్స్ చెప్పుకోవాలని ఈ సందర్భంగా పృథ్వీరాజ్ అన్నాడు.
మంచి కథను ఆడియన్స్ కు అందిస్తే ఆ సినిమాను హిట్ చేసే బాధ్యతను వాళ్లే తీసుకుంటారని, ఆ నమ్మకం తనకుందని పృథ్వీరాజ్ చెప్పారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన లూసిఫర్ మంచి హిట్ అయిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా వస్తున్న ఎల్2 ఎంపురాన్ కూడా విజయం సాధిస్తుందని ఫృథ్వీరాజ్ చాలా ధీమాగా ఉన్నాడు.