ఆడుజీవితం.. మైత్రి మెగా రిలీజ్..!
మలయాళంలో పృధ్విరాజ్ సుకుమారన్ చేస్తున్న సినిమాలు అక్కడ మంచి ఫలితాలు అందుకుంటున్నాయి
By: Tupaki Desk | 31 Jan 2024 6:49 AM GMTమలయాళంలో పృధ్విరాజ్ సుకుమారన్ చేస్తున్న సినిమాలు అక్కడ మంచి ఫలితాలు అందుకుంటున్నాయి. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ హీరోగా పృధ్విరాజ్ తన సత్తా చాటుతున్నారు. కోవిడ్ లాక్ డౌన్ టైం లో అతని సినిమాలు సౌత్ ఆడియన్స్ అంతా ఆదరించారు. ఆ క్రేజ్ తోనే అప్పటి నుంచి పృధ్విరాజ్ చేసే ప్రతి సినిమా మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు. ప్రస్తుతం పృధ్విరాజ్ ఆడుజీవితం అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను బ్లెస్సీ డైరెక్ట్ చేస్తుండగా సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
సినిమా నుంచి వచ్చిన ప్రచార చిత్రాలు ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ఏప్రిల్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే తెలుగు రిలీజ్ ని మెగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. ఆడు జీవితం సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నామని. అద్భుతమైన కథ అద్భుతమైన టీం తో చెప్పబడుతుందని తమ సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.
పృధ్విరాజ్ చేసే సినిమాల్లో మ్యాజిక్ ఉంటుంది. కచ్చితంగా ఆడు జీవితం కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చెప్పొచ్చు. పృధ్విరాజ్ సుకుమారన్ రీసెంట్ గా ప్రభాస్ సలార్ లో వరద రాజమన్నార్ పాత్రలో నటించారు. సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా వరద రాజ మన్నార్ పాత్రలో తన మార్క్ చూపించారు పృధ్విరాజ్.
సలార్ 1 లో ప్రభాస్ స్నేహితుడిగా కనిపించిన పృధ్విరాజ్ సెకండ్ పార్ట్ లో ప్రభాస్ తో ఢీ కొట్టే పాత్రలో కనిపించనున్నారు. సలార్ 1 సీజ్ ఫైర్ సూపర్ హిట్ కాగా ఆడియన్స్ అంతా సలార్ 2 శౌర్యాంగ పర్వం కోసం ఎదురుచూస్తున్నారు. అప్పటిదాకా పృధ్విరాజ్ ఆడు జీవితంతో అలరించాలని చూస్తున్నాడు. ఆడుజీవితం సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారు.
ఆడు జీవితం ఎవ్రీ బ్రీత్ ఈజ్ ఏ బ్యాటిల్ అంటూ సరికొత్త కంథాశంతో వస్తున్నారు పృధ్విరాజ్. కంటెంట్ తో కూడిన సినిమాలు చేస్తూ సౌత్ ఆడియన్స్ అందరిని మెప్పిస్తున్న పృధ్విరాజ్ తన సినిమాల ప్లానింగ్ తో సర్ ప్రైజ్ చేస్తున్నారు. సలార్ సినిమా తర్వాత ఆడు జీవితం లాంటి సినిమా చేయడం సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. సినిమాలు నిర్మించడమే కాదు ఈమధ్యనే కొత్తగా డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసిన మైత్రి మూవీ మేకర్స్ పృధ్విరాజ్ ఆడు జీవితం తెలుగు లో రిలీజ్ చేస్తున్నారు.మైత్రి వారు రిలీజ్ చేస్తున్నారు అంటే సినిమా కచ్చితంగా హిట్ టార్గెట్ తోనే వస్తుందని అంచనా వేయొచ్చు.