ప్రభాస్ అందరి డార్లింగ్.. ఆ సీక్రెట్ బయట పెట్టిన పృధ్విరాజ్..!
సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సలార్ గురించి ప్రభాస్ గురించి తన స్పెషల్ గా చెప్పుకొచ్చారు పృధ్విరాజ్ సుకుమారన్.
By: Tupaki Desk | 16 Dec 2023 4:55 PM GMTప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సలార్ సినిమా ఫస్ట్ పార్ట్ సలార్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుంది. ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా ప్రభాస్ ని ఢీ కొట్టే పాత్రలో పృధ్వి రాజ్ సుకుమారన్ నటించారు. సలార్ సినిమాలో పృధ్విరాజ్ వరద రాజ మన్నార్ పాత్రలో నటించారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సలార్ గురించి ప్రభాస్ గురించి తన స్పెషల్ గా చెప్పుకొచ్చారు పృధ్విరాజ్ సుకుమారన్.
సలార్ లో ప్రభాస్ దేవ పాత్రలో నటించగా తాను వరదరాజ మన్నార్ గా కనిపిస్తా.. కెరీర్ లో ఇప్పటివరకు ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ చూడలేదని అన్నారు పృధ్విరాజ్. ఈ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ప్రభాస్ ని ఎవరైనా ఇష్టపడతారు. తనకున్న చాలా తక్కువ మంది స్నేహితుల్లో ప్రభాస్ కూడా ఒకరు. సెట్ లో అందరినీ జాగ్రత్తగా చూసుకుంటాడు. అందరి కోసం అతను భోజనం తెప్పిస్తాడు. చుట్టూ ఉండే వాళ్లని సంతోషంగా ఉండేలా చూసుకుంటాడని అన్నారు. అభిమానులు ప్రభాస్ ని డార్లింగ్ అని ఎందుకంటారో ఈ సినిమా షూటింగ్ టైం లో తనకు అర్థమైందని అన్నారు పృధ్వి రాజ్.
సలార్ తో తన కల నెరవేరిందని.. సినిమా టీజర్, ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ. సినిమాలో చాలా మ్యాటర్ ఉందని అన్నారు. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషనల్ గా కూడా ఉన్న కథ సలార్ అని అన్నారు. సినిమా చూసేందుకు వచ్చిన వారంతా కూడా మంచి ఫీలింగ్ తో బయటకు వస్తారని అన్నారు. సలార్ సెకండ్ పార్ట్ కి లీడ్ కూడా అద్భుతంగా ఉంటుందని అన్నారు పృధ్వి రాజ్ సుకుమారన్.
మలయాళంలో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న పృధ్విరాజ్ సుకుమారన్ సలార్ సినిమాలో ప్రభాస్ కి ఈక్వల్ పాత్రలో మెప్పించనున్నారు. సలార్ సినిమా రిజల్ట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నామని చెబుతున్నారు పృధ్విరాజ్. కె.జి.ఎఫ్ తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ అంటూ సినిమా మొదలు పెట్టిన నాటి నుంచి ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ట్రైలర్ వచ్చింది. బాహుబలి తర్వాత సరైన కమర్షియల్ హిట్ కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. మరి సలార్ వారి ఆకలి తీర్చుతుందా లేదా అన్నది చూడాలి.