Begin typing your search above and press return to search.

స‌లార్ లో అంత హింస లేద‌న్న వ‌ర‌దా!

ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క‌మైన వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ పాత్ర పోషించి మ‌ల‌యాళం న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార్ విమ‌ర్శ‌ల‌పై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 2:30 PM GMT
స‌లార్ లో అంత హింస లేద‌న్న వ‌ర‌దా!
X

ఇటీవ‌ల రిలీజ్ అయిన పాన్ ఇండియా చిత్రం 'స‌లార్' ఎంత పెద్ద విజ‌యం సాధించిందో తెలిసిందే. వ‌సూళ్ల‌తో బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. 'సాహో'..'ఆదిపురుష్' లాంటి వ‌రుస ప‌రాజ‌యాల్ని డార్లింగ్ ని ఇబ్బంది పెట్టినా స‌లార్ విజ‌యంతో అన్ని లెక్క‌లు బ్యాలెన్స్ అయిపోయాయి. ఒక విజ‌యంతో! రెండు ప‌రాజ‌యాల లెక్క బ‌ధులు తీర్చేసాడు. ఇక స‌లార్ -2 తో అంత‌కు మంచి స‌లంచ‌నం సృష్టిస్తానని ఓ పెన్ గానే స్టేట్ మెంట్ ఇచ్చాడు.

దీంతో రెండ‌వ భాగంపై అంచ‌నాలు ఇంకా పెరిగిపోతున్నాయి. అయితే మొద‌టి భాగంలో హింస‌.. కృర‌త్వం...యాక్ష‌న్ అతిగా ఉంద‌ని విమ‌ర్శ‌లు తెర‌పైకి వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. సినిమాకి ఎంత స‌క్సెస్ సాధించిందో అంత‌కంత‌కు హింస విష‌యంలో విమ‌ర్శ‌లు ఎదుర్కుంటోంది. ఈ నేప‌థ్యంలో సినిమాలో కీల‌క‌మైన వ‌ర‌ద‌రాజ మ‌న్నార్ పాత్ర పోషించి మ‌ల‌యాళం న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార్ విమ‌ర్శ‌ల‌పై ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేసారు.

'నేను న‌టుడినే కాదు. ద‌ర్శ‌కుడిని కూడా. క‌థ‌..పాత్ర‌కు అనుగుణంగా హింస‌..ర‌క్త‌పాతం ఉంటే గ్రాఫిక్స్ ద్వారా ద‌ర్శ‌కుడు దాన్ని చూపిస్తాడు. ఆయ‌న‌కు ఆర‌క‌మైన స్వేచ్ఛ ఉంటుంది. ద‌ర్శ‌కుడు చెప్పింది న‌టుడు చేయాల్సిందే. చివ‌రిగా మేమంతా ఓ చిత్రాన్ని త‌యారు చేసి నియంత్ర‌ణ సంస్థ సెన్సార్ బోర్డ్ ముందుకు తీసుకెళ్తాం. వాళ్లు మా సినిమా చూసి ఎలా ఉందో నిర్దారించుకుని ఓ స‌ర్టిఫికెట్ అందిస్తారు.

ఫ‌లానా వ‌ర్గాలు వారు మాత్ర‌మే చూడాల‌ని అందులో చెబుతారు. మా బాధ్య‌త చిత్రాన్ని త‌యారు చేసి వాళ్ల ముందుకు తీసుకెళ్ల‌డం వ‌ర‌కే.' గేమ్ ఆఫ్ థ్రోన్స్' లాంటి హాలీవుడ్ సినిమాల్లోని ర‌క్త‌పాతం. .నిర్దాక్ష ణ్యంగా చంపుకోవ‌డంతో పొలిస్తే స‌లార్ లో మ‌రీ అంత హింస లేదు' అని అన్నారు. ప్ర‌స్తుతం ఈ వ్యాఖ్య‌లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. సినిమా వాళ్లు కాబ‌ట్టి వాళ్ల‌కు అనుకూలంగా ఎలాగైనా మాట్లాడుతార‌ని ప‌లువురు నెటి జ‌నులు పృథ్వీ వ్యాఖ్య‌ల‌పై అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు.