సలార్: ముక్కు పుడక సూట్ కాలేదు రాజా
సలార్ పాన్ ఇండియాలో దుమ్ము దులపడం ఖాయమని అంచనా ఉంది. దానికి తగ్గట్టే ఒక్కో లుక్ రిలీజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ బృందం వేడెక్కిస్తోంది
By: Tupaki Desk | 16 Oct 2023 3:30 PM GMTసలార్ పాన్ ఇండియాలో దుమ్ము దులపడం ఖాయమని అంచనా ఉంది. దానికి తగ్గట్టే ఒక్కో లుక్ రిలీజ్ చేస్తూ ప్రశాంత్ నీల్ బృందం వేడెక్కిస్తోంది. ఇప్పటికి అడపాదడపా ప్రభాస్ లుక్ తో పాటు, కొన్ని ఇతర కీలక పాత్రల లుక్ లను రిలీజ్ చేసారు. ఇందులో విలన్ గా నటించిన పృథ్వీరాజ్ లుక్ ఒకటి.
తాజాగా నెట్టింట వైరల్ గా మారిన పృథ్వీరాజ్ సుకుమారన్ లుక్ పై రకరకాలుగా విశ్లేషణలు సాగుతున్నాయి. అతడి లుక్ చూడటానికి భీకరంగా కనిపించినా కానీ, కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా అతడి సాఫ్ట్ అర్బన్ లుక్ కి సరిపోని ముక్కుపుడకపైనా అందరూ విమర్శిస్తున్నారు.
అసలు ఇది అతడికి ఏమాత్రం సూట్ కాలేదంటూ సూటి పోటి మాటలు అంటున్నారు జనం. 'సై' సినిమాలో ప్రదీప్ రావత్ కి సూటైంది ఆ ముక్కు పుడక.. అతడి భీకర రూపానికి మాస్ అప్పీల్ కి ఆ ముక్కు పుడక యాప్ట్.. అలాగే 'కేజీఎఫ్'లో విలన్లకు సూటబుల్..కానీ సలార్ లో పృథ్వీరాజ్ లుక్ చూడటానికి కొంత ఎబ్బెట్టుగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. అతడు స్టైలిష్ గా పక్క పాపిడితో స్మార్ట్ గా సాఫ్ట్ బోయ్ లా ఉన్నాడు.. అందుకే ఆ ముక్కు పుడక సూట్ కాలేదు.. మాసిన గడ్డం గుబురు మీసకట్టు దానికి తగ్గట్టు తీక్షణమైన చూపులు.. ఎంపిక చేసుకున్న కాస్ట్యూమ్స్ ఇవన్నీ మాసీగా అనిపించినా కానీ, తీరుగ్గా తీర్చిదిద్దినట్టు ఉన్న ఆ హెయిర్ స్టైల్ కి మ్యాచింగ్ గా అనిపించడం లేదు.
నిజానికి అడవిలో బిజిలీలు (గిరిజన అమ్మాయిలు) ముక్కు పుడకలతో కనిపిస్తారు. అది వారికి యాప్ట్. కోయదొరలు కూడా ముక్కు పుడకలతో కనిపించారు. అది వారికి సూటబుల్. కానీ ఇక్కడ సలార్ ఇలాఖాలో విలన్లకు ఈ ముక్కు పుడక ఎలా సూటవుతుందో.. అంత క్లాస్ లుక్ తో కనిపించే పృథ్వీరాజ్ కి ఈ ముక్కుపుడక పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో కానీ, ప్రశాంత్ నీల్ పెద్ద తెరపై ఎలా జస్టిఫై చేస్తాడో చూడాలి. సలార్ డిసెంబర్ లో క్రిస్మస్ కానుకగా విడుదలవుతోంది. తెలుగు-తమిళం-కన్నడం-మలయాళం- హిందీ భాషల్లో అత్యంత భారీగా ఇది రిలీజవుతోంది. హోంబలే ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్ కథానాయకుడిగా నటించగా, ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.