Begin typing your search above and press return to search.

ప్ర‌ముఖ న‌టుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్

ఇప్పుడు ఈ బ్యూటీ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడిని పెళ్లాడింది. అత‌డితో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ప్రియా ఎట్ట‌కేల‌కు పెళ్లితో సెటిలైంది. ప్రియా ఇంత‌కీ ఎవ‌రిని పెళ్లాడింది? అంటే...!

By:  Tupaki Desk   |   15 Feb 2025 6:30 AM GMT
ప్ర‌ముఖ న‌టుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్
X

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ స‌ర‌సన న‌టించింది ప్రియా బెన‌ర్జీ. సందీప్ కిష‌న్, నారా రోహిత్ లాంటి యువ‌హీరోల‌ చిత్రాల్లోను న‌టించింది. ఇప్పుడు ఈ బ్యూటీ ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడిని పెళ్లాడింది. అత‌డితో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ప్రియా ఎట్ట‌కేల‌కు పెళ్లితో సెటిలైంది. ప్రియా ఇంత‌కీ ఎవ‌రిని పెళ్లాడింది? అంటే...!


జన్నే తు యా జానే నా, ధోబీ ఘాట్, బాఘి 2, దమ్ మారో దమ్ వంటి చిత్రాలలో తన పాత్రలతో యువ‌త‌రంలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ ప్రతీక్ బబ్బర్ బాలీవుడ్‌లో అత్యంత పాపుల‌ర్ న‌టులలో ఒకరు. అత‌డు ప్రియా బెన‌ర్జీతో చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నాడు. ప్రేమికుల‌రోజున (14 ఫిబ్రవరి 2025న) నటి ప్రియా బెనర్జీని వివాహం చేసుకున్నాడు. ఈ జంట తమ వివాహాన్ని ధృవీకరిస్తూ కొన్ని పెళ్లి ఫోటోల‌ను షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి.


ప్రతీక్ తల్లి, దివంగత నటి స్మితా పాటిల్ ఇంటి వెలుపల మీడియాను ఈ జంట‌ పలకరించారు. ప్ర‌తీక్ ఇంట్లోనే వివాహ వేడుక జ‌రిగింది. ఇటీవ‌ల న‌వ‌ వధువు ప్రియా బెనర్జీ తన ఇన్‌స్టాలో పెళ్లికి సంబంధించిన కొన్ని గ్లింప్స్‌ను షేర్ చేసారు. ఈ పెళ్లిలో ప్రతీక్ బబ్బర్ పెళ్లి మండపానికి వచ్చి ఆచారాల కోసం తన పక్కన కూర్చోవడం చూసి ప్రియా భావోద్వేగానికి గురైన క్షణానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేసింది. వివాహానంత‌రం న‌వ‌వధూవరులు పార్టీ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ప్రతీక్ - ప్రియా పెళ్లిలో ఎంపిక చేసిన అతిథులు.. సన్నిహితులు, కుటుంబ సభ్యుల నుండి శుభాకాంక్షలను అందుకున్నారు. వేదిక‌పై పాట‌ల కార్య‌క్ర‌మం ఆక‌ట్టుకుంది.


ప్రతీక్ బబ్బర్ పాపుల‌ర్ సినీకుటుంబం నుంచి వ‌చ్చిన న‌ట‌వార‌సుడు. రాజ్ బబ్బర్ - దివంగత నటి స్మితా పాటిల్ దంప‌తుల‌ కుమారుడు. అత‌డి త‌ల్లి ప్రసవ సమస్యల కారణంగా మరణించ‌డం ఒక విషాదం. తన తల్లితో సమయం గడపకపోయినా ప్రతీక్ ఎల్లప్పుడూ ఆమెపై ఎంతో ప్రేమాభిమానాల‌ను చాటుకుంటూనే ఉన్నాడు. పెళ్లిలోను త‌న త‌ల్లిని సంస్మ‌రిస్తూ నివాళుల‌ర్పించాడు. ఈ పెళ్లిలో, తరుణ్ తహిలియాని రూపొందించిన కస్టమ్ వివాహ దుస్తులలో న‌వ‌వ‌ధూవ‌రులు క‌నిపించారు.

టాలీవుడ్ లో ప్రియా జోరు:

టాలీవుడ్ లో ప‌లు చిత్రాల్లో త‌నదైన అందం, న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది ప్రియా బెన‌ర్జీ. సందీప్ కిష‌న్ `జోరు` చిత్రంలో న‌టించింది. ఈ చిత్రంలో రాశీ ఖ‌న్నా న‌ట‌న‌తో పాటు ప్రియా బెన‌ర్జీ గ్లామ‌ర‌స్ పాత్ర‌లో ఆక‌ట్టుకుంటుంది. ప్రియా బెన‌ర్జీ 2013లో `కిస్` చిత్రంతో టాలీవుడ్ కి ప‌రిచ‌య‌మైంది. అడివి శేష్ న‌టించి స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. కృష్ణ విజ‌య్, నారా రోహిత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన `అసుర` చిత్రంలోను న‌టించింది. ప్రియా అంద‌చందాలు, గ్లామ‌ర్ డోస్ యూత్‌కి న‌చ్చినా, ఆ త‌ర్వాత రేర్ గా ఛాన్సులొచ్చాయి. ప‌లు త‌మిళ హిందీ చిత్రాల్లోను ప్రియా న‌టించింది. ప్రియా సోష‌ల్ మీడియాల‌లోను స్పీడ్ గా ఉంది.