పిక్‌టాక్ : ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో
సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేసే ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఎల్లో డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 12 March 2025 12:12 PM ISTకన్ను గీటి, ముద్దుగన్ను పేల్చి ఓవర్ నైట్‌లో జాతీయ స్థాయిలో సెలబ్రెటీ అయిన ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా 'నిలవుకు ఎన్ మెల్ ఎన్నడి కోబం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ధనుష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్ కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఆ సినిమాతో పాటు విష్ణు ప్రియ అనే కన్నడ మూవీలోనూ నటించింది. ఆ మధ్య ఈ అమ్మడి కెరీర్ కాస్త డల్‌గా సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో వచ్చిన ప్రియా ప్రకాష్ వారియర్ మరో రెండు మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
ప్రియా ప్రకాష్ వారియర్ తెలుగులోనూ పలు సినిమాల్లో నటించింది. చెక్, ఇష్క్ సినిమాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో తెలుగులో పెద్దగా ఆఫర్లను ఈ అమ్మడు సొంతం చేసుకోలేక పోతుంది. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో కీలక పాత్రలో నటించడంతో పాటు మరికొన్ని సినిమాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. టాలీవుడ్‌లో ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదు. కానీ సోషల్ మీడియాలో ఈమె షేర్ చేసే అందమైన ఫోటోల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఇంత అందమైన అమ్మాయికి ఎందుకు తెలుగులో ఆఫర్లు రావడం లేదని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేసే ప్రియా ప్రకాష్ వారియర్ తాజాగా ఎల్లో డ్రెస్‌లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అంటారు... కానీ ఈ ఫోటోల్లో ప్రియా ప్రకాష్ వారియర్‌ను చూస్తూ ఉంటే దాన్ని మార్చి ఎల్లో ఎల్లో బ్యూటీ ఫెల్లో అనాలి అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందమైన ఫోటోలను షేర్ చేసినప్పుడు మరో ఐదు పది సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ప్రియా వారియర్ ఉంటుంది, ఆమె కచ్చితంగా ముందు ముందు తెలుగులోనూ మంచి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటుంది అంటున్నారు.
చూడ్డానికి క్యూట్‌గా అనిపించడంతో పాటు, స్కిన్ షో విషయంలో ఇతర హీరోయిన్స్‌తో పోటీ పడుతూ ఉంటుంది. అందుకే ప్రియా ప్రకాష్ వారియర్‌కి కన్నడ, తమిళ్ సినిమాల్లో క్రమం తప్పకుండా ఆఫర్లు వస్తున్నాయి. ఇండస్ట్రీలో ఈమె చేసిన సినిమాలు, చేస్తున్న సినిమాల విషయం పక్కన పెడితే భవిష్యత్తులో మరిన్ని మంచి సినిమాలు ఈమె నుంచి వచ్చే అవకాశం ఉందని, హిందీలోనూ ఈమెకు మంచి ఆఫర్లు వస్తాయనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్థాయిలో అందంగా కనిపిస్తే ముందు ముందు ఈమెకు మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.