Begin typing your search above and press return to search.

సినిమాల కోసం శరీరాన్ని చూపించడం ఇష్టం లేదు

ఇటీవల బ్లాక్ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 11:30 PM GMT
సినిమాల కోసం శరీరాన్ని చూపించడం ఇష్టం లేదు
X

సంతోష్ శోభన్‌ హీరోగా అనీల్ కుమార్‌ ఆల్ల దర్శకత్వంలో వచ్చిన కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్‌. మొదటి సినిమాతోనే నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది. కోలీవుడ్‌ లో ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు టాలీవుడ్‌ నుంచి సైతం ఆఫర్లు దక్కించుకుంటుంది.. కానీ కొన్ని కండిషన్స్ పెడుతున్న కారణంగా ఆఫర్లు వెనక్కి పోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల బ్లాక్ సినిమాలో నటించింది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

గ్లామర్‌ పాత్రల్లో నటించే ఆసక్తి చూపించక పోవడం వల్లే టాలీవుడ్‌ నుంచి వచ్చిన సినిమా ఆఫర్లు ఫైనల్‌ కాకుండానే క్యాన్సల్‌ అవుతున్నట్లుగా ఆమె మాటలను బట్టి అర్థం అవుతోంది. హీరోయిన్ గా నటించాలంటే స్కిన్‌ షో చేయాల్సిందే, గ్లామర్ గా కనిపించాల్సిందే అంటూ వస్తున్న వార్తలను, చెబుతున్న విషయాలపై ఆమె అసహనం వ్యక్తం చేసింది. అసలు శరీరాన్ని, గ్లామర్ ని చూపించి సినిమాలకు ప్రేక్షకులను రప్పించడం ఏంటో అంది. కెరీర్‌ పరంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను గ్లామర్‌ పాత్రలో నటించను అంటూ ఖరాకండీగా చెప్పేసింది. అంతే కాకుండా ఈ అమ్మడు ముందు ముందు ఆఫర్లు రాకున్నా స్కిన్ షో కు ఓకే చెప్పను అంది.

శరీరాన్ని వస్తువుగా భావించను.. ప్రేక్షకులకు ఒక వస్తువుగా నా శరీరాన్ని చూపించాలని అనుకోవడం లేదు. అసలు అలాంటి పాత్రలను నేను అంగీకరించను. ఒక మోస్తరు వరకు సినిమాల్లో అందంగా కనిపించడం ఓకే కానీ ఎక్కువ పరిధి దాటితే మాత్రం అది బాగోదు అన్నట్లుగా తన అభిప్రాయం వ్యక్తం చేసింది. నెగటివ్‌ రోల్స్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. హీరోయిన్‌ గానే నటించాలి అని నేను ఎప్పుడూ అనుకోవడం లేదు. అంతే కాకుండా నటిగా మంచి గుర్తింపు వచ్చే సినిమాలను నేను ఎప్పుడూ చేసేందుకు ముందు ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

ఫేమ్‌ సొంతం చేసుకోవడం కోసం స్కిన్‌ షో చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో రాణించడానికి సైతం అందంగా కనిపిస్తే చాలు కానీ ఎక్కువగా స్కిన్‌ షో చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. అంతే కాకుండా సోషల్‌ మీడియాలో ఈమె చాలా అరుదుగా మాత్రమే ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి హీరోయిన్స్ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీకి వర్కౌట్‌ కారు అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం హీరోయిన్స్‌ అంటే ఇలా కూడా ఉంటారా... స్కిన్‌ షో చేయకుంటే హీరోయిన్ అని ఎలా అంటారు అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రియా భవానీ మాత్రం స్కిన్‌ షో చేసేదే లేదు అంటోంది.