బలగం హీరోకి గేమ్ ఛేంజర్ షాక్..!
గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి కూడా ఉన్నాడు. 25 రోజుల డేట్స్ దాకా ఇచ్చానని కానీ సినిమాలో తను 2 నిమిషాలు కూడా లేనని అన్నాడు.
By: Tupaki Desk | 12 March 2025 8:00 AM ISTసపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చి ఇప్పుడు లీడ్ రోల్స్ చేసి సత్తా చాటే పొజిషన్ కి వచ్చాడు టాలీవుడ్ యాక్టర్ ప్రియదర్శి. పెళ్లిచూపులు సినిమాతో పాపులర్ అయిన ప్రియదర్శి ఓ పక్క స్టార్ సినిమాల్లో ఫ్రెండ్ రోల్స్ చేస్తూనే మల్లేశం, బలగం లాంటి సినిమాల్లో లీడ్ రోల్ చేశాడు. అతని సోలో అటెంప్ట్ మల్లేశం మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా బలగం సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. వేణు యెల్దండి చెప్పిన కథను నమ్మి బలగం సినిమా చేసిన ప్రియదర్శి సూపర్ సక్సెస్ అందుకున్నాడు.
అదే కాదు ప్రియదర్శి చేస్తున్న సోలో సినిమాలన్నీ కూడా ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. ప్రస్తుతం నాని నిర్మాణంలో కోర్ట్ సినిమా చేశాడు ప్రియదర్శి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాం చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా గురించి ప్రస్తావించాడు. శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ ఇయర్ సంక్రాంతికి రిలీజైంది. ఐతే సినిమా రిజల్ట్ గురించి అందరికీ తెలిసిందే.
గేమ్ ఛేంజర్ సినిమాలో ప్రియదర్శి కూడా ఉన్నాడు. 25 రోజుల డేట్స్ దాకా ఇచ్చానని కానీ సినిమాలో తను 2 నిమిషాలు కూడా లేనని అన్నాడు. శంకర్ డైరెక్షన్ లో ఒక సినిమా అయినా చేయాలనే ఆలోచనతో ఈ సినిమా చేశానని చరణ్ అన్న కోసం సినిమా చేశానని చెప్పుకొచ్చాడు ప్రియదర్శి. అంతేకాదు ఆ సినిమా బలగం కన్నా ముందు సైన్ చేశానని చెప్పారు ప్రియదర్శి.
తెలుగులో ఎలాంటి పాత్రకైనా సరిపోయే నటుల్లో ప్రియదర్శి ఒకరని ప్రూవ్ చేసుకున్నాడు. ఓ పక్క స్టార్ సినిమాల్లో సైడ్ రోల్స్ చేస్తూనే తను లీడ్ రోల్ సినిమాలతో అలరిస్తున్నాడు. కోర్ట్ సినిమాలో తన పాత్ర బాగుంటుందని ప్రతి ఒక్కరు సినిమా చూసి సర్ ప్రైజ్ అవుతారని అంటున్నాడు ప్రియదర్శి. ఈ సినిమాతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటితో సారంగపాణి జాతకం తో కూడా రాబోతున్నాడు ప్రియదర్శి.
చిన్నగా లీడ్ రోల్స్ సినిమాలు చేస్తూ సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటున్నాడు. కోర్ట్ సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్న ప్రియదర్శి ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. తను చేస్తున్న సినిమాలతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియదర్శి కెరీర్ లో ఇంకా ప్రయోగాలు చేయాలని చూస్తున్నాడు.