కోర్ట్ ట్రైలర్.. ఇంప్రెసివ్..!
రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు.
By: Tupaki Desk | 7 March 2025 10:04 PM ISTఓ పక్క హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా కూడా వరుస సినిమాలు చేస్తున్నాడు నాని. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో ప్రశాంతి తో కలిసి నాని ఇప్పటికే అ!, హిట్ 1, హిట్ 2 సినిమాలు నిర్మించారు. ఇప్పుడు అదే బ్యానర్ లో నాని సమర్పణలో ప్రశాంతి నిర్మాతగా రూపొందించిన సినిమా కోర్ట్. రామ్ జగదీష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందించారు.
ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజి, సాయి కుమార్ లీడ్ రోల్స్ లో నటించారు. కోర్ట్ టైటిల్ లోనే సినిమా నేపథ్యం ఏంటన్నది తెలిసేలా చేయగా.. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ మరింత డీటైల్స్ అందించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఎన్నో రియలిస్టిక్ విషయాల గురించి కోర్ట్ లో ప్రస్తావించారు. చట్ట సభలు ఉన్నోళ్లకి ఒకలా, లేనోళ్లకి మరోలా పనిచేస్తాయా అన్న కోణంలో న్యాయం కోసం ఒక లాయర్ చేసే పోరాటమే ఈ కోర్ట్ కథాంశంగా వస్తుంది.
కోర్ట్ సినిమా ట్రైలర్ లోనే కథ చెప్పేశాడు దర్శకుడు. ఐతే ఇలాంటి సినిమాలకు ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించాలంటే ట్రైలర్ ని ఇలానే ఇంట్రెస్టింగ్ గా కట్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి సినిమా మనం చూడబోతున్నాం అన్నది ఆడియన్ కి ఒక ఐడియా ఉంటే బాగుంటుంది. అందుకే కోర్ట్ ట్రైలర్ లో సినిమా కథ ఏంటి ఎలా ఉండబోతుంది అన్నది పర్ఫెక్ట్ గా చూపించారు.
ఇక సినిమా నుంచి వచ్చిన సాంగ్ ఆల్రెడీ సూపర్ హిట్ కాగా నాని నుంచి వస్తున్న సినిమా కాబట్టి ఆడియన్స్ లో కూడా మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవిల నటన హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. ట్రైలర్ లో చూపించింది శాంపిలే సినిమాలో చాలా అంశాలు ఆడియన్స్ ని ఆశ్చర్యానికి గురి చేస్తాయని చిత్ర యూనిట్ చెబుతున్నారు. కోర్ట్ ట్రైలర్ అయితే ఇంప్రెసివ్ గా ఉంది. తప్పకుండా ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తోనే వస్తున్నారని అనిపిస్తుంది.
హోలీ సందర్భంగా మార్చి 14న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. పోటీగా సినిమాలు ఉండగా నాని బ్రాండ్ తో ఈ కోర్ట్ రంగంలోకి దిగుతుంది.