Begin typing your search above and press return to search.

ప్రియదర్శి డార్లింగ్.. వచ్చేది ఎప్పుడంటే..

ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. జులై 19న డార్లింగ్ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 9:44 AM GMT
ప్రియదర్శి డార్లింగ్.. వచ్చేది ఎప్పుడంటే..
X

స్టార్ కమెడియన్ గా దూసుకుపోతున్న ప్రియదర్శి మరో వైపు హీరోగా కూడా మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది బలగం మూవీతో ప్రియదర్శి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత ఈ ఏడాది ఓం భీమ్ బుష్ మూవీలో కీలక పాత్రలో కనిపించారు. ఇదిలా ఉంటే ఇప్పుడు డార్లింగ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.

చాలా గ్యాప్ తర్వాత కన్నడ బ్యూటీ నభా నటేష్ డార్లింగ్ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. అశ్విన్ రామ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని హనుమాన్ మూవీతో పాన్ ఇండియా లెవల్ లో సక్సెస్ అందుకున్న నిరంజన్ రెడ్డి నిర్మించారు. తన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2గా డార్లింగ్ చిత్రాన్ని నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. జులై 19న డార్లింగ్ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. రాంగ్ కామ్ జోనర్ లో ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది.

ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరో, హీరోయిన్స్ మధ్య ఎలాంటి గిల్లికజ్జాలు జరిగాయి. వాటి పర్యవసానం ఎంత వరకు వెళ్ళింది అనేది ఈ డార్లింగ్ మూవీలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కథ యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరికి రిలేట్ అయ్యే విధంగా ఉంటుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్ గా చెబుతోంది. కచ్చితంగా ప్రతి ఒక్కరు మూవీని చూసి తమ లైఫ్ లో కూడా ఇలాంటి సిచువేషన్స్ ఎదురయ్యాయని అనుకుంటారంట.

ప్రియదర్శి, నభా నటేష్ పెర్ఫార్మెన్స్ డార్లింగ్ మూవీకి మెయిన్ అస్సెట్ గా నిలుస్తుందని టాక్. అలాగే వివేక్ సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆ సాంగ్స్ కూడా యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయంట. మరి ప్రియదర్శి ఈ చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హనుమాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న నిర్మాత నిరంజన్ రెడ్డి స్టోరీ సెలక్షన్ పైన కూడా డార్లింగ్ మూవీతో మరో సక్సెస్ అందుకుంటే ఆయనకు తిరుగుండదు అని చెప్పవచ్చు.