Begin typing your search above and press return to search.

ప్రియదర్శి లక్కు మార్చే డార్లింగ్.. ఏమవుతుందో..

కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి ప్రస్తుతం డార్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

By:  Tupaki Desk   |   9 July 2024 11:24 AM GMT
ప్రియదర్శి లక్కు మార్చే డార్లింగ్.. ఏమవుతుందో..
X

కమెడియన్ కమ్ హీరో ప్రియదర్శి ప్రస్తుతం డార్లింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. జులై 19న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అశ్విన్ రామ్ దర్శకుడిగా ఈ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ తో ట్రైలర్ ఆకట్టుకుంది.

దీంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. బలగం లాంటి సూపర్ హిట్ తర్వాత ప్రియదర్శి హీరోగా వస్తోన్న సినిమా కావడంతో చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కమెడియన్ గా సక్సెస్ అయిన ప్రియదర్శికి డార్లింగ్ మూవీ హిట్ అయితే మరిన్ని అవకాశాలు హీరోగా వస్తాయి. నభా నటేష్ ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నటించింది. మూవీ స్టోరీ విషయానికి వస్తే పెళ్లి తర్వాత భార్యతో ఇటలీ హనీమూన్ కి వెళ్లాలని ప్రియదర్శి కలలు కంటూ ఉంటాడు.

అలాంటి వాడి లైఫ్ లోకి స్ప్లిట్ పర్సనాలిటీ ఉన్న నభా నటేష్ భార్యగా వస్తుంది. ఆమెతో హీరో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేది కథలో కామెడిగా చూపించారు. నభా నటేష్ క్యారెక్టర్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో ఉంటుంది. క్షణాల్లో క్యారెక్టరైజేషన్ మార్చేసే అమ్మాయి పెళ్ళాంగా ఉంటే వాడి పరిస్థితి ఏంటనేది డార్లింగ్ సినిమాలో చూడాల్సిందే. ఇదిలా ఉంటే కల్కి తర్వాత ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఒక్క సినిమా రిలీజ్ కాలేదు.

జులై 12న కమల్ హాసన్ భారతీయుడు 2 మూవీ థియేటర్స్ లోకి వస్తోంది. సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్న కూడా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఓపెనింగ్స్ వరకు అయితే మంచి వసూళ్లు రావొచ్చు. ఒక వేళ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న వారం రోజులు హడావిడి ఉంటుంది. జులై 19న డార్లింగ్ మూవీ రిలీజ్ కాబోతోంది. నిరంజన్ రెడ్డికి డిస్టిబ్యూటర్ గా కూడా అనుభవం ఉంది. చాలా థియేటర్స్ ఆయన హ్యాండ్ లో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో కాస్తా ఎక్కువ థియేటర్స్ లోనే డార్లింగ్ మూవీని రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మూవీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన కూడా మంచి వసూళ్లు తెచ్చుకోవచ్చు. ప్రియదర్శి లీడ్ రోల్ చేస్తున్న నేపథ్యంలో ఫన్ కావాల్సినంత ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. థియేటర్స్ లో 2 గంటల వినోదాన్ని అందిస్తే ఆటోమేటిక్ గా మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకోవచ్చని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇక బలగం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ప్రియదర్శికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. యూత్ ని ఎట్రాక్ట్ చేసే కంటెంట్ సినిమాలో గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి కంటెంట్ తో మెప్పించగలిగితే తిరుగుండదు. ఇక అతను ఈ సినిమాతో హిట్ కొడితే సోలో హీరోగా మరిన్ని అవకాశాలు వస్తాయి. మరి అతను లక్కు ఎలా ఉందో చూడాలి.