నేషనల్ అవార్డ్ హీరోయిన్ పై అలాంటి విమర్శలు..!
ఈ క్రమంలో నేషనల్ అవార్డ్ వచ్చిన ఒక హీరోయిన్ ప్రేమ పెళ్లిపై కొందరు చేసిన విమర్శల గురించి ఆ హీరోయిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
By: Tupaki Desk | 5 Oct 2024 8:30 PMసినిమా సెలబ్రిటీల జీవితాల పట్ల ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటారు. కొందరు తమ స్వలాభం కోసం అలా చేస్తుంటే కొందరు ఏమి తోచక సోషల్ మీడియాలో వారి గురించి రకరకాలుగా ట్రోల్స్ చేస్తుంటారు. ఈ క్రమంలో నేషనల్ అవార్డ్ వచ్చిన ఒక హీరోయిన్ ప్రేమ పెళ్లిపై కొందరు చేసిన విమర్శల గురించి ఆ హీరోయిన్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పెళ్లైన కొత్తలో సినిమాతో పాపులర్ అయిన ప్రియమణి అప్పటికే తమిళంలో వరుస సినిమాలు చేస్తూ మంచి ఫాం లో ఉంది.
తన నటనతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్న ప్రియమణి 2016 లో ముస్తఫా రాజ్ ని పెళ్లాడింది. ఐతే తన పెళ్లి జరిగిన నాటి నుంచి చాలామంది ఎన్నో రకాల విమర్శలు చేశారని ప్రియమణి చెప్పుకొచ్చారు. ముస్తఫా రాజ్ తనకు ఎంతోకాలంగా తెలుసు.. మా ఇష్టాలు కలిసాయి దానికి పెద్దల అంగీకారం రావడంతో వివాహం చేసుకున్నాం. ఐతే తన పెళ్లి గురించి చాలా విధాలుగా తనని విమర్శించారని ప్రియమణి అన్నారు.
వేరే మతానికి చెందిన వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకున్నావ్ అంటూ కొందరు తనని తప్పుపడుతూ ట్రోల్ చేశారని గుర్తు చేసుకున్నారు. ఐతే ఏదైనా సందర్భం వస్తే ఇప్పటికి కూడా తనపై అలాంటి ట్రోల్స్ చేస్తున్నారని అన్నారు ప్రియమణి. ఐతే ఆ ట్రోల్స్ కు ఎంత ప్రాధాన్యత ఇవ్వకూడదు అనుకున్నా సరే కొన్ని మాటలు తనను ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. పెళ్లికి కులం, మతం అనేది అడ్డంకి ఉండదని ఎంతోమంది స్టార్లు చాటిచెప్పారు. ఐతే తన విషయంలో మాత్రం ఈ విమర్శలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ప్రేమ అనేది రెండు హృదయాలకు సంబందించిన విషయం.. ప్రాంత, భాష, కులం మతం ఇలాంటి వ్యత్యాసాలు ప్రేమకు ఉండవని అన్నారు.
ఇక ప్రియమణి సినిమా అవకాశాల గురించి చూస్తే.. హీరోయిన్ గా కాకపోయినా ఇప్పటికీ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూ ప్రియమణి అలరిస్తుంది. ఈమధ్యనే భామా కలాపం 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రియమణి బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది. ప్రస్తుతం ప్రియమణి మలయాళంలో ఒక సినిమా కన్నడలో ఒక సినిమా చేస్తుంది. సినిమాలో ఎలాంటి చిన్న రోల్ అయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తుంది ప్రియమణి.