Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : శనివారం బ్యూటీ క్యూట్‌ షో

నాని హీరోగా వచ్చిన 'నాని గ్యాంగ్‌లీడర్‌' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌.

By:  Tupaki Desk   |   1 Dec 2024 5:42 AM GMT
పిక్‌టాక్‌ : శనివారం బ్యూటీ క్యూట్‌ షో
X

నాని హీరోగా వచ్చిన 'నాని గ్యాంగ్‌లీడర్‌' సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్‌ మోహన్‌. టాలీవుడ్‌లో ఈ అమ్మడి సినిమాలు తక్కువే వచ్చినా దక్కిన గుర్తింపు మాత్రం చాలా ఎక్కువ అనే చెప్పాలి. మొదటి సినిమాతోనే క్యూట్‌ బ్యూటీ అనిపించుకుంది. సాధారణంగా స్కిన్‌ షో చేస్తేనే ముద్దుగుమ్మలకు సౌత్‌లో మంచి ఆఫర్లు వస్తాయి. కానీ ఇతర హీరోయిన్స్‌తో పోల్చితే ప్రియాంక అరుల్‌ మోహన్‌ తక్కువ స్కిన్‌ షో చేస్తుంది. అయినా మంచి గుర్తింపు దక్కించుకుంటుంది. తాజాగా ఈమె నానితో కలిసి 'సరిపోదా శనివారం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

పవన్ కళ్యాణ్‌తో సాహో సుజీత్‌ దర్శకత్వంలో 'ఓజీ' సినిమాలో ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. పవన్‌ బిజీగా ఉండటం వల్ల సినిమా ఇంకా విడుదల కాలేదు. వచ్చే ఏడాది సమ్మర్‌కి ఓజీ సినిమాతో ప్రియాంక అరుల్‌ మోహన్‌ మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని ఓజీ సినిమాతో ప్రియాంక దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఓజీ తర్వాత టాలీవుడ్‌ లో ఈ అమ్మడు టాప్‌ స్టార్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

సోషల్‌ మీడియాలో సాధారణంగా స్కిన్‌ షో చేసే ముద్దుగుమ్మలకు మాత్రమే మంచి ఫాలోయింగ్‌ ఉంటుంది. కానీ ప్రియాంక అరుల్‌ మోహన్‌కి మాత్రం స్కిన్‌ షో చేయకున్నా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈమె ఏ ఫోటోలు షేర్‌ చేసినా పెద్ద ఎత్తున స్పందన దక్కించుకుంటూ ఉంది. తాజాగా మరోసారి క్యూట్‌ ఫోటోలతో ప్రియాంక అరుల్‌ మోహన్‌ మెప్పించింది. ఫుల్‌ డ్రెస్‌లో క్యూట్‌ కిల్లింగ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ తో ప్రియాంక అరుల్‌ మోహన్‌ మత్తెక్కిస్తోంది. ఇలా స్కిన్‌ షో చేయకున్నా కేవలం చూపులతో మత్తు ఎక్కించగల సత్తా కేవలం ప్రియాంక మోహన్‌కే సాధ్యం అంటూ కొందరు ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రియాంక మోహన్‌ ఓజీ సినిమాతో పాటు తమిళ్‌లో ధనుష్ నిర్మిస్తున్న ఒక సినిమాలో నటిస్తోంది. ఈ రెండు కాకుండా మరో రెండు మూడు సినిమాలు సైతం ఈ అమ్మడు లైన్‌లో పెట్టింది. త్వరలోనే ఆ సినిమాలు సైతం అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. తెలుగులో ఓజీ సినిమా తర్వాత ఈమె కొత్త సినిమాలకు కమిట్‌ కావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓజీ సినిమా తర్వాత ఈమె పారితోషికం రెట్టింపు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పటికే దాదాపుగా కోటి పారితోషికంను ఈ అమ్మడు అందుకుంటుందట. ఓజీ హిట్‌తో ఆ పారితోషికం రెండు కోట్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి.