Begin typing your search above and press return to search.

ప్రియాంక అరుళ్ మోహన్.. బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ గ్లామర్ షో

ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Oct 2024 1:30 AM GMT
ప్రియాంక అరుళ్ మోహన్.. బ్లాక్ డ్రెస్సులో స్టన్నింగ్ గ్లామర్ షో
X

ప్రియాంక అరుళ్ మోహన్ తాజాగా తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ కాంబినేషన్‌తో కనిపిస్తోంది. అమీత్ అగర్వాల్ డిజైన్ చేసిన ఈ ప్రత్యేక డ్రెస్ ఆమె అందంలో బాగా కలిసిపోయింది. స్టైలింగ్ లో ఆమె స్టిల్ కూడా ఈ అవుట్‌ఫిట్‌కు పూర్తిగా న్యాయం చేసింది. ఫోటోగ్రాఫర్ పళణియప్పన్ సుబ్రహ్మణ్యం కెమెరాతో తీసిన ఈ ఫొటోస్ బ్యాక్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో ప్రియాంక అందాన్ని హైలైట్ చేస్తున్నాయి.

ప్రియాంక మోహన్ తన హుందాతనంతో హృదయాలను గెలుచుకుంటూ పోతున్నారు. ఆమె తన ప్రత్యేకమైన శైలి, అందంతో ప్రతి ఫోటోలోనూ ఒక కొత్తగా కనబడుతున్నారు. ఈ లుక్‌లో ప్రియాంక లుక్స్ తో పాటు ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ను ప్రదర్శిస్తోంది. ఫ్యాషన్‌కు సంబంధించిన జ్యువెలరీ, ఆరుస్ జ్యూవెల్స్ ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. ఇందులో స్టైలిష్ కాన్సెప్ట్ తో ఆమె తనకున్న అందాన్ని మళ్లీ రీడిఫైన్ చేసుకున్నారు.

కెరీర్ విషయానికి వస్తే, ప్రియాంక మోహన్ ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. ‘సరిపోదా శనివారం’ వంటి హిట్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఓజీ’ లో కూడా కనిపించబోతున్నారు. ఇక విశ్వక్ సేన్ సరసన నటించబోయే మరో సినిమాతో ఆమె జోరు కొనసాగిస్తోంది.

ఇలా ప్రతి సినిమాలో తనదైన ముద్ర వేసుకుంటూ వెళ్తున్న ప్రియాంక, ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆమె తన ప్రతి ప్రాజెక్ట్‌లోనూ ఒక కొత్త ఛాలెంజ్ లాంటి క్యారెక్టర్ తో కనిపిస్తోంది, నటనలో మరింత కొత్తగా నిరూపించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ OG సినిమాలో ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. తప్పకుండా అమ్మడి రేంజ్ ను పెంచే సినిమాగా OG నిలుస్తుందని చెప్పవచ్చు.