Begin typing your search above and press return to search.

అగ్ర హీరోలంద‌రి ఫేవ‌రెట్ హీరోయిన్

గొప్ప స్టార్ డ‌మ్ అందుకోవాల‌ని, కోట్లాది రూపాయ‌ల పారితోషికం కొల్ల‌గొట్టాల‌ని ఏ క‌థానాయిక‌ ఆశించ‌దు? ప్ర‌తిభావంతురాలైన ప్రియాంక అరుల్ మోహ‌న్ అందుకు అతీతం కాదు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 1:30 AM GMT
అగ్ర హీరోలంద‌రి ఫేవ‌రెట్ హీరోయిన్
X

గొప్ప స్టార్ డ‌మ్ అందుకోవాల‌ని, కోట్లాది రూపాయ‌ల పారితోషికం కొల్ల‌గొట్టాల‌ని ఏ క‌థానాయిక‌ ఆశించ‌దు? ప్ర‌తిభావంతురాలైన ప్రియాంక అరుల్ మోహ‌న్ అందుకు అతీతం కాదు. తమిళ హీరోయిన్ ప్రియాంక వ‌రుస‌గా భారీ చిత్రాలకు సంత‌కాలు చేయాల‌ని క‌ల‌లుగంటోంద‌ట‌.

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో `ఓజి`లో అవ‌కాశం అందుకున్న ఈ బ్యూటీ ఇటీవ‌లే నానితో `సరిపోదా శనివారం` విడుద‌లై విజ‌యం సాధించిన నేప‌థ్యంలో ఇక‌పై టాలీవుడ్‌లో పట్టు సాధించడానికి గ‌ట్టి ప్ర‌య‌త్నాల్లో ఉంద‌ని స‌మాచారం.

గ్యాప్ తర్వాత తెలుగులో సినిమాలు చేస్తోంది. నానీతో గ్యాంగ్ లీడ‌ర్ ఆశించిన విజ‌యం సాధించ‌క‌పోయినా స‌రిపోదా శ‌నివారం మంచి టాక్ తెచ్చుకోవ‌డంతో ఈ అమ్మ‌డిలో కొత్త ఉత్సాహం క‌నిపిస్తోంది. నేటిత‌రంలో మాలీవుడ్ భామ‌ల‌కు పోటీనిస్తూ క‌న్న‌డ రంగం నుంచి కొంద‌రు క‌థానాయిక‌లు దూసుకొచ్చారు. కానీ త్రిష త‌ర్వాత త‌మిళ‌మ్మాయిలు ఎవ‌రూ ఇక్క‌డ అంత‌గా ఫేమ‌స్ కాలేదు. ఇప్పుడు ఆ లోటును అరుల్ మోహ‌న్ తీర్చాల‌ని క‌సిగా ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.

ప‌వ‌న్ తో ఓజీ స‌క్సెసైతే త‌న రేంజ్ మారిపోతుంద‌ని ప్రియాంక భావిస్తోంద‌ట‌. అదే క్ర‌మంలో టాలీవుడ్‌లోని అగ్ర కథానాయికలలో స్థానం కోసం వేచి చూస్తోంది. టాలెంట్ ఉంది.. మంచి లుక్స్ ఉన్నాయి. కానీ ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్లు ప‌డాలి. త‌మిళంలో డాక్టర్ , డాన్ వంటి బ్లాక్‌బస్టర్‌లలో న‌టించిన ప్రియాంక అక్క‌డ క్రేజీ హీరోయిన్లలో ఒక‌రిగా కొన‌సాగుతోంది. సూర్య, శివ కార్తికేయన్ వంటి తమిళ స్టార్‌లతో కలిసి పని చేసింది. ధనుష్‌తో కలిసి `కెప్టెన్ మిల్లర్`లో త‌న న‌ట‌న‌కు మంచి పేరొచ్చింది.

చూస్తుండ‌గానే సౌత్ అగ్ర హీరోలంద‌రితోను న‌టించేసింది! అయితే ఓజీతో బ్రేక్ కోస‌మే ఈ బ్యూటీ వెయిటింగ్. ఇంత‌లోనే ఇప్పుడు లారెన్స్ మాస్టార్ స‌ర‌స‌న బెంజ్ అనే చిత్రానికి సంత‌కం చేసింద‌ని క‌బురు అందింది. అయితే ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.