Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : చీరలో సింప్లీ సూపర్‌ చారు మేడం

2019లో 'నాని గ్యాంగ్‌ లీడర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్‌ మోహన్‌.

By:  Tupaki Desk   |   14 Sep 2024 12:30 AM GMT
పిక్ టాక్ : చీరలో సింప్లీ సూపర్‌ చారు మేడం
X

2019లో 'నాని గ్యాంగ్‌ లీడర్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రియాంక అరుళ్‌ మోహన్‌. కర్ణాటకలోని బెంగళూరులో జన్మించిన ఈ అమ్మడు 'ఒంధ్ కతే హెల్లా' సినిమా తో కన్నడ సినిమా పరిశ్రమలో అడుగు పెట్టింది. మొదటి సినిమాలో గెస్ట్‌ గా నటించిన ప్రియాంక మోహన్‌ ఆ తర్వాత తెలుగులో నాని తో కలిసి నటించింది. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకోకున్నా ప్రియాంక మోహన్‌ కి మంచి గుర్తింపు లభించింది. ఆ వెంటనే శర్వానంద్‌ హీరోగా రూపొందిన శ్రీకారం సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత తమిళ సినిమాల వైపు వెళ్ళింది.

వైద్యుడు, ఏతార్కుం తూనింధవన్, డాన్‌, టిక్ టాక్, కెప్టెన్ మిల్లర్ సినిమాలతో తమిళ ప్రేక్షకులను అలరించింది. తాజాగా తెలుగు లో ఈమె సరిపోదా శనివారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. నానితో కలిసి ప్రియాంక అరుళ్ మోహన్‌ వరుసగా రెండో సినిమాను చేసింది. రెండు సినిమాలూ డీసెంట్‌ హిట్‌ ను సొంతం చేసుకున్న నేపథ్యంలో ముందు ముందు వారి కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ తో కలిసి ఈ అమ్మడు ఓజీ సినిమాలో నటిస్తోంది.

కెరీర్ ఆరంభం నుంచి సింప్లీ సూపర్ అనిపించుకుంటూ ఉన్న ప్రియాంక అరుళ్ మోహన్‌ మరోసారి తన చీర కట్టు ఫోటోలతో సంప్లీ సూపర్‌ అనిపించుకుంది. చీర కట్టి, లూజ్ హెయిర్‌ తో కెమెరా ముందు హొయలు పోకుండా సింపుల్‌ గా ఫోటోలకు ఫోజ్ ఇచ్చిన ప్రియాంక మోహన్‌ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. నాని సినిమాల్లో ఉన్నట్లుగానే చాలా సింపుల్‌ గా, చాలా డీసెంట్ గా ఉన్నావు అంటూ ప్రియాంక పై ప్రశంసలు కురిపిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సరిపోదా శనివారం సినిమాలో కానిస్టేబుల్‌ చారులతగా ఎలా అయితే కనిపించి మెప్పించిందో అలాగే ఈ ఫోటోల్లో సింప్లీ సూపర్ అన్నట్లుగా ఉంది.

పవన్‌ కళ్యాణ్ తో చేస్తున్న 'ఓజీ' సినిమా కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సాహో సుజీత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తి అయి విడుదల అవ్వాల్సి ఉన్నా పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది. ఈ నెలలో షూటింగ్‌ పునః ప్రారంభించాలి అనుకున్నారు. ప్రియాంక డేట్స్ కూడా తీసుకున్నారట. కానీ ఏపీ లో పెద్ద ఎత్తున వర్షాలు, వరదలు రావడంతో ఓజీ సినిమా షూటింగ్‌ మళ్లీ ఆలస్యం అవుతోంది. పవన్‌ తో ప్రియాంక మోహన్‌ ను చూడాలని ఆమె ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.