OGతో కల నెరవేరిందట..!
యువ హీరోలతో నటిస్తూ ఒక్కసారిగా పవర్ స్టార్ సినిమా ఛాన్స్ అందుకుంది ప్రియాంక.
By: Tupaki Desk | 18 Feb 2025 11:30 PM GMTకోలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. ఆల్రెడీ తమిళ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న అమ్మడు లాస్ట్ ఇయర్ తెలుగులో నానితో సరిపోదా శనివారం సినిమాతో హిట్ అందుకుంది. నాని సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా చేస్తుంది అమ్మడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఓజీ సినిమాను సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. యువ హీరోలతో నటిస్తూ ఒక్కసారిగా పవర్ స్టార్ సినిమా ఛాన్స్ అందుకుంది ప్రియాంక.
కచ్చితంగా అమ్మడికి ఇది కెరీర్ టర్నింగ్ ఆఫర్ అని చెప్పొచ్చు. ప్రియాంక ఏ ఈవెంట్ కి వెళ్లినా కూడా ఫ్యాన్స్ ఓజీ అప్డేట్ అడుగుతున్నారట. అంతేకాదు పవర్ స్టార్ తో నటించడం తన కల నెరవేరిందని చెబుతుంది అమ్మడు. సినిమా కొద్దిరోజుల షూట్ మాత్రమే ఉందని త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుందని చెబుతుంది. ఓజీ సినిమా అప్డేట్స్ తో ప్రియాంక వార్తల్లో నిలుస్తుంది.
డివివి బ్యానర్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమా అసలైతే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అది మిస్ అవ్వగా ఈ ఇయర్ మార్చి ఎండింగ్ కి రిలీజ్ లాక్ చేశారు. ఇప్పుడు అది కూడా మిస్ అయ్యేలా ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఓజీని సమ్మర్ లేదా పోస్ట్ సమ్మర్ అంటే జూన్, జూలైలో తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.
ఓజీ సినిమాను సుజిత్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఓజీ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. జస్ట్ ఓజీ గ్లింప్స్ తోనే అదరగొట్టిన థమన్ సినిమా మొత్తం షేక్ ఆడించేస్తాడని అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. ఐతే వీరమల్లుని ముందు రిలీజ్ చేసి ఆ తర్వాత ఓజీ సినిమా రిలీజ్ షెడ్యూల్ చేస్తారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది మాత్రం పవర్ స్టార్ నుంచి రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని మాత్రం ఫిక్స్ అవ్వొచ్చు.