Begin typing your search above and press return to search.

పెళ్లై ఆరేళ్లు అయినా నెట్టింట న‌వ‌దంప‌తులే!

తాజాగా ప్రియాంక‌-నిక్ మ‌రోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇదిగో ఇక్క‌డిలా బీచ్ బికినీ దుస్తుల్లో ఇద్ద‌రు ఇలా స‌ముద్ర‌యానం ఆస్వాదిస్తూ చ‌ర్చ‌కు తెర తీసారు.

By:  Tupaki Desk   |   14 Sep 2024 5:31 AM GMT
పెళ్లై ఆరేళ్లు అయినా నెట్టింట న‌వ‌దంప‌తులే!
X

గ్లోబ‌ల్ స్టార్ ప్రియాంక చోప్రా-నిక్ జోనాస్ జోడీ జీవితాన్ని ఎంత అందంగా ఆస్వాదిస్తారో చెప్పాల్సిన ప‌నిలేదు. వివాహామై ఆరు సంవ‌త్స‌రాలు గడుస్తున్నా? ఇప్ప‌టికీ నెట్టింట న‌వ‌దంప‌తుల్లా హైలైట్ అవుతుంటారు. షూటింగ్ లు లేక‌పోతే ఇద్ద‌రు చిలౌట్ మోడ్ లో కి జారుకుంటారు. అది ఇల్లు అయినా... వెకెషాన్ స్పాట్ అయినా? స‌రే ఒక‌ర్ని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంత బాండింగ్ ని చాటుతుంటారు.

ఇద్ద‌రు క్లోజ్ గా ఉన్న బికినీ ఫోటోలు ఇప్పుడికే ఎన్నో వైర‌ల్ అయ్యాయి. ప్రేమ‌గా ఒక‌రికొక‌రు ఆపిల్ ముక్క లు తినిపించుకుంటారు. వైన్..జ్యూస్ గ్లాస్ ల‌తో స‌ర‌సాలాడుకుంటారు. గిల్లిక‌జ్జాలాడుకుంటారు. ఇలా ఒక‌టేంటి? త‌మ మ‌ధ్య అన్యోన్య‌త‌ని ఎంతో ఓపెన్ గానే చేసేస్తుంటారు. పాశ్చ‌త్య‌ క‌ల్చ‌ర్ లో ఇవ‌న్నీ స‌హ‌జం. కాబ‌ట్టి వాటిని అంతే ఓపెన్ గా అభిమానుల‌కు షేర్ చేస్తుంటారు.

తాజాగా ప్రియాంక‌-నిక్ మ‌రోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఇదిగో ఇక్క‌డిలా బీచ్ బికినీ దుస్తుల్లో ఇద్ద‌రు ఇలా స‌ముద్ర‌యానం ఆస్వాదిస్తూ చ‌ర్చ‌కు తెర తీసారు. డార్క్ క‌ల‌ర్ టూపీస్ దుస్తుల్లో పీసీ స్కిన్ షో హైలైట్. అమ్మ‌డు టాప్ టూ బాట‌మ్ ధ‌గ‌ధ‌గ‌లాడుతుంది. అమ్మ‌డి టోన్డ్ బాడీ మిరుమిట్లు గొలుపుతుంది. క్లోజ్ షాట్స్ లో పీసీ ఆయిల్డ్ స్కిన్ మ‌రింత స్పెష‌ల్. లాంగ్స్ షాట్స్ లో భ‌ర్త ఒడిలో ప‌డుకుని ప్రేమ బంధాన్ని ఆస్వాదిస్తుంది.

భార్య‌పై నిక్ అంతే ప్రేమ‌ను చాటుతున్నాడు. ఆకాశం నీల‌..స‌ముద్రం నీలం..మేము మాత్రం తెలుపు అంటూ ఇలా త‌మ‌లో వేడిని ప‌రిచ‌యం చేసారు. వివిధ భంగిమ‌ల్లో కెమారికి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇక పీసీ-నిక్ ఇటీవ‌ల ఇండియా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. సోద‌రుడి పెళ్లి కార్య‌క్ర‌మంలో భాగంగా ఇండియాకి వ‌చ్చారు.