Begin typing your search above and press return to search.

ఆస్కార్స్- 2025: ప్రియాంక చోప్రా 'అనుజ'కు ఏమైంది?

97వ అకాడమీ అవార్డులను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి భారతదేశం నుంచి లఘు చిత్రం `అనుజ` అవార్డ్ గెలుచుకోవ‌డం ఖాయం అంటూ చాలా ప్ర‌చారం సాగింది.

By:  Tupaki Desk   |   3 March 2025 11:14 AM IST
ఆస్కార్స్- 2025: ప్రియాంక చోప్రా అనుజకు ఏమైంది?
X

97వ అకాడమీ అవార్డులను ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈసారి భారతదేశం నుంచి లఘు చిత్రం `అనుజ` అవార్డ్ గెలుచుకోవ‌డం ఖాయం అంటూ చాలా ప్ర‌చారం సాగింది. గ్లోబ‌ల్ ఐక‌న్ ప్రియాంక చోప్రా నిర్మాత‌ల్లో ఒక‌రిగా ఉండి ప్ర‌చారం చేయ‌డంతో అనుజ‌కు బోలెడంత హైప్ వచ్చింది. ఉత్తమ లైవ్ యాక్షన్ లఘు చిత్రం కేటగిరీలో ఈ చిత్రం పోటీప‌డ‌గా చివ‌రి నిమిషంలో అవ‌కాశం కోల్పోయింది. డచ్ సైన్స్ ఫిక్షన్ చిత్రం `ఐయామ్ నాట్ ఎ రోబోట్` ఉత్త‌మ ల‌ఘు చిత్రంగా అవార్డును ద‌క్కించుకుంది. ఈ విభాగంలో ది లాస్ట్ రేంజర్, ఎ లియెన్, ది మ్యాన్ హూ కుడ్ నాట్ రిమైన్ సైలెంట్ వంటి బలమైన పోటీ చిత్రాలు ఉన్నాయి. కానీ చివరికి `ఐయామ్ నాట్ ఎ రోబోట్` విజేతగా నిలిచింది.

ఐయామ్ నాట్ ఎ రోబోట్ లారా కథను తెర‌పై అందంగా ఆవిష్క‌రించింది. లారా CAPTCHA పరీక్షలలో పదే పదే విఫలమైన తర్వాత తనకు తానుగా ఒక వింతైన కొత్త నిజాన్ని కనుగొంటుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2023లో నెదర్లాండ్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శిత‌మైంది. ఐడెంటిటీ స‌హా సాంకేతికతపై ప్రత్యేకమైన దృక్పథంతో రూపొందించిన ఈ ల‌ఘు చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

2024 అమెరికన్ హిందీ భాషా లఘు చిత్రం `అనుజ` ఇద్దరు సోదరీమణులు జీవ‌న ప్ర‌యాణానికి సంబంధించిన క‌థ‌. తత్వవేత్త నుండి ఫిలింమేక‌ర్ గా మారిన ఆడమ్ జె.గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సజ్దా పఠాన్, అనన్య షాన్‌భాగ్, నగేష్ భోంస్లే నటించారు. ఈ కథ తొమ్మిది సంవత్సరాల ప్రతిభావంతురాలైన అమ్మాయి అనుజ, ఆమె సోదరి పాలక్ జీవితాన్ని మార్చే అవకాశం గురించిన పోరాటం క‌థ‌. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేద‌ యువతుల పోరాటాలను తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నమిది. దక్షిణాసియాకు చెందిన క‌ళాకారిణి సుచిత్ర మట్టాయ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. `అనుజ` 17 ఆగస్టు 2024న హోలీషార్ట్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. ఈ చిత్రం ఆస్కార్ అవార్డును ద‌క్కించుకోలేక‌పోయినా కానీ, ప్రతిష్టాత్మక అవార్డులలో నామినేషన్ పొంద‌డం ప్ర‌చారానికి క‌లిసొచ్చింది. నిర్మాతలు మిండీ కాలింగ్ - గుణీత్ మోంగా కపూర్ మద్దతుతో ప్రియాంక చోప్రా జోనాస్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఈ చిత్రం తెర‌కెక్కింది.