Begin typing your search above and press return to search.

ప్రియాంక చోప్రా సోద‌రుడి పెళ్లి సంద‌డి

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి 29 గురించి చాలా చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   6 Feb 2025 3:30 AM GMT
ప్రియాంక చోప్రా సోద‌రుడి పెళ్లి సంద‌డి
X

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ - రాజ‌మౌళి కాంబినేష‌న్ మూవీ ఎస్.ఎస్.ఎం.బి 29 గురించి చాలా చ‌ర్చ సాగుతోంది. ఈ సినిమాలో గ్లోబ‌ల్ ఐకాన్ ప్రియాంక చోప్రా క‌థానాయిక‌గా న‌టిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. జ‌క్క‌న్న అధికారికంగా ఇంకా దీనిని ప్ర‌క‌టించాల్సి ఉంది. ఇటీవ‌ల మ‌హేష్ తో పీసీ షూటింగుల్లో పాల్గొంటోంద‌ని క‌థ‌నాలొచ్చాయి.


ఇంత‌లోనే ఇప్పుడు ముంబైకి వెళ్లిన ప్రియాంక చోప్రా త‌న సోద‌రుడి పెళ్లి వేడుకల్లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ప్రియాంక చోప్రా జోనాస్ తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా -నీలం ఉపాధ్యాయల వివాహ వేడుకలను హల్ది వేడుకలతో ప్రారంభించారు. ఈ పెళ్లికి ప్రియాంక చోప్రా సాంప్ర‌దాయ భార‌తీయ దుస్తుల్లో క‌నిపించింది.


ప్రీవెడ్డింగ్ వేడుక‌ల నుంచి కొన్ని ఫోటోల‌ను పీసీ షేర్ చేయ‌గా అవి వైరల్‌గా మారుతున్నాయి. ప్రియాంక చోప్రా.. త‌న తల్లి మధు చోప్రా చాలా స‌న్నితంగా ఫోజులిచ్చిన ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. పసుపులో తడిసిన వధువు - వరుడి అద్భుతమైన ఫోటోలు కూడా ఈ షూట్ లో ఉన్నాయి.


ఇంత‌కుముందు సంగీత్ లో పీసీ కుటుంబం పాడిన సాంప్రదాయ పంజాబీ పాట కోసం డ్యాన్స్ మూవ్స్ ని ప్ర‌ద‌ర్శించింది. వారి తల్లి మధు కూడా నృత్యం చేయగా, పీసీ త్వరలో వివాహం చేసుకోబోయే జంటను ఉత్సాహపరిచింది. ఈరోజు (ఫిబ్రవరి 5, 2025), మెహెంది - కాక్‌టెయిల్ ఈవెంట్‌ను కుటుంబం నిర్వహించింది. ప్రీ-వెడ్డింగ్ వేడుక‌ల కోసం ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ తల్లిదండ్రులు డెనిస్ -పాల్ జోనాస్ క‌లిసి విచ్చేసారు.