ఎడారిలో స్టార్ హీరోయిన్ సాహసాలు
సౌదీ అరేబియా- జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ షోస్టాపర్స్ గా నిలిచారు.
By: Tupaki Desk | 15 Dec 2024 3:15 AM GMTసౌదీ అరేబియా- జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్ షోస్టాపర్స్ గా నిలిచారు. రెడ్ కార్పెట్ ఈవెంట్ అనంతరం ఈ జంట జెడ్డాను విడిచిపెట్టలేదు. ఆ తర్వాత కూడా ఆ దేశంలోని ఎగ్జోటిక్ లొకేషన్లను ఆస్వాధించేందుకు, విహారయాత్ర కోసం సమయాన్ని కేటాయించారు. జెడ్డా ఎడారిలో ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ విన్యాసాలకు సంబంధించిన ఫోటోషూట్లు, వీడియోలు ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఎడారిలో అడ్వెంచర్ చేస్తున్న వీడియోలను కూడా పీసీ షేర్ చేసింది.
ఇన్‌స్టాలో ఈ వెకేషన్ నుంచి వరుస ఫోటోలను పీసీ షేర్ చేస్తోంది. ఒక ఫోటోలో తెల్లటి క్రాప్ టాప్ ధరించి చొక్కా -డెనిమ్ ప్యాంటుతో కనిపించింది. తన తలకు తెల్లటి గుడ్డను చుట్టుకుంది. ఇసుక బైక్‌ను వేగంగా నడుపుతున్న ఫోటోలు, వీడియోలను కూడా పీసీ షేర్ చేసింది.
మరోవైపు ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ ఒంటెతో మాట్లాడుతూ.. ఫన్నీగా కనిపించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ జంట జెడ్డాలో నగరాలలో షికార్ చేస్తూ... స్థానికంగా లభించే రుచికరమైన వంటకాలను ఆరగించారు. జెడ్డాలోని తన అభిమానుల ప్రేమ ఆప్యాయతలకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక - నిక్ ముంబైలో ఆగస్ట్ 2018లో నిశ్చితార్థం చేసుకున్నారు. డిసెంబర్ 2018లో జోధ్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ముందు ప్రియాంక చోప్రా ఆన్ లొకేషన్ సినిమాల చిత్రీకరణలో బిజీగా ఉంది. సెట్స్ లో ఉన్నప్పుడు తన టీమ్ తన కోసం రెండు రూములను ఇచ్చారని, అందులో ఒక రూమ్ లో పెళ్లి ప్రణాళికలు సాగేవని కూడా పీసీ వెల్లడించింది.