Begin typing your search above and press return to search.

రాబోయేది చ‌లికాలం.. ప్రియానిక్ ఇలా రోమాంచితం

చ‌లి చ‌లిగా గిలిగా రోమాంచిత స‌మ‌యాన్ని ఆస్వాధించాల‌ని హింట్ ఇచ్చింది పీసీ.

By:  Tupaki Desk   |   25 Oct 2024 3:30 PM GMT
రాబోయేది చ‌లికాలం.. ప్రియానిక్ ఇలా రోమాంచితం
X

భారతదేశంలో సుడిగాలి పర్యటనను ముగించి తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. అక్క‌డ త‌న భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి రోమాంచిత జీవితాన్ని ఆస్వాధిస్తోంది. ఈ జంట అన్యోన్య‌త రొమాంటిక్ లైఫ్ ఎలా ఉంటుందో మ‌రోసారి స్ప‌ష్ఠంగా ఈ ఫోటోగ్రాఫ్స్ లో బ‌య‌ట‌ప‌డింది. తాజాగా ప్రియానిక్ జంట ` ఫైర్‌సైడ్ రిట్రీట్` ఇచ్చింది. అగ్నికి స‌మీపంగా హాయిగా ఉన్న క్షణానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రతి ఒక్కరికీ ప్రధాన డేట్ నైట్ స్ఫూర్తి.. రాబోయేది చ‌లికాలం.. చ‌లి చ‌లిగా గిలిగా రోమాంచిత స‌మ‌యాన్ని ఆస్వాధించాల‌ని హింట్ ఇచ్చింది పీసీ. ఇది ఒక ర‌కంగా శీతాకాల ప్ర‌వేశంపై రిమైండర్.


అక్టోబరు 25న ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో నిశ్చలమైన ఫైర్‌సైడ్ దృశ్యాన్ని కలిగి ఉన్న ఒక వీడియోను షేర్ చేసింది. తన భర్త, గాయకుడు నిక్ జోనాస్‌ను ట్యాగ్ చేస్తూ ఈ పోస్ట్‌కి ల‌వ‌ర్ ఈమోజీని జోడించి, రొమాంటిగ్గా హాయిగా గడిపిన విష‌యాన్ని ఫ్యాన్స్ కి షేర్ చేసింది పీసీ. ఈ చిన్న క్లిప్ పెద్ద విష‌యాన్ని గుర్తు చేసింది.

రాబోయే చ‌లికాలంలో ప్రియానిక్ జంట ఏం చేయ‌బోతోందో.. రొమాంటిక్ డేట్ ని ఎలా ఆస్వాధించ‌బోతోందో అభిమానుల‌కు హింట్ ఇచ్చారు. నిత్య‌జీవితంలో ఒత్తిళ్ల‌మ‌యం అయిన బిజీ జీవితం నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు శీతాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో కూడా ఇది రిమైండ‌ర్ గా ఉండ‌బోతోంది. నిక్‌తో పీసీ `ఫైర్‌సైడ్ సమయం` కలలు కనే డేట్ నైట్ ని త‌ల‌పిస్తోంది. ఇది నిజంగా జంటలకు సరైన ప్రేరణగా నిలిచింది.

ఫోర్బ్స్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీసీ మాట్లాడుతూ బాలీవుడ్ , హాలీవుడ్ రెండు ప‌రిశ్ర‌మ‌ల్లోనూ తన ప్రయాణం గురించి మాట్లాడింది. రెండు పరిశ్రమల మధ్య వ్యత్యాసాల గురించి చర్చిస్తూ...స్క్రిప్ట్‌లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, నిర్మాతలతో కూడిన మేకింగ్ విష‌యాలు ప్రపంచవ్యాప్తంగా ఒకేలా ఉన్నాయని తెలిపింది. అయినా కానీ పీసీ సాంస్కృతిక వ్యత్యాసాలను హైలైట్ చేసింది. హాలీవుడ్ గొప్ప సంస్థల‌తో పనిచేస్తుందని విస్తృతమైన రైటింగ్ వ‌ర్క్ చేస్తార‌ని తెలిపింది. షూట్‌కు ముందు ఒకరు కంటిన్యూగా వ‌రుస‌ ఇమెయిల్‌లను ఎలా స్వీకరిస్తారో .. నిర్దిష్ట స‌మ‌యంలో ప‌ని పూర్తి చేయ‌డానికి షెడ్యూల్‌లు చాలా క‌చ్చితమైనవిగా ఉంటాయని పీసీ వెల్ల‌డించింది.

దీనికి విరుద్ధంగా బాలీవుడ్ లో స్క్రిప్టు మెరుగుదల. వనరులపై ఎక్కువ మొగ్గు చూపుతుంది. తరచుగా పనులను పూర్తి చేయడానికి `జుగాద్`పై ఆధారపడుతుంది. రిలాక్స్ డ్ గా ప‌ని చేయ‌డం అంటే, దాదాపు శృంగారభరితమైన విధానంలో దేశ స్వభావాన్ని ప్రతిబింబిస్తుందని పీసీ తెలిపారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... ప్రియాంక చోప్రా ఇటీవల అమెరికన్ రొమాంటిక్ కామెడీ `లవ్ ఎగైన్‌`లో నటించింది. ప్రస్తుతం గూఢచారి సిరీస్ `సిటాడెల్` రెండవ సీజన్ చిత్రీకరణలో పాల్గొంటోంది. సిటాడెల్‌తో పాటు మ‌రో రెండు ప్రధాన ప్రాజెక్ట్‌ల్లోను న‌టిస్తోంది. ది బ్లఫ్ , హెడ్స్ ఆఫ్ స్టేట్ చిత్రాల‌లో ఎగ్జ‌యిట్ చేసే కొత్త‌ద‌నం నిండిన‌ పాత్రలలో న‌టిస్తోంద‌ని సమాచారం.