అందుకే ప్రియాంక చోప్రాకి అంత డేరింగ్!
ఆ సంగతేంటో మామ్ మధు చోప్రా మాటల్లోనే.. ' మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన తర్వాత ప్రియాంకకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ తనకి నటించాలనే ఆసక్తి ఎంత మాత్రం లేదు.
By: Tupaki Desk | 10 Dec 2024 3:45 AMప్రియాంక చోప్రా సక్సెస్ పుల్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మడు తనని తానే స్టార్ గా మార్చుకుంది. బాలీవుడ్ లో ఓ వెలిగిన అనంతరం హాలీవుడ్ కి వెళ్లింది.అక్కడా సత్తా చాటింది. ఎంతో మంది భామలు హాలీవుడ్ కి వెళ్లినా ప్రియాంక చోప్రా స్థాయిలో ఎవరూ సక్సెస్ అవ్వలేదు. పీసీ మాత్రం గ్లోబల్ బ్యూటీగా సంచలనం సృష్టించింది. గ్లామర్...డీగ్లామర్ ఇలా ఎలాంటి పాత్ర అయినా అవలీలగా పోషించగల నటి.
ఇక హాలీవుడ్ లో స క్సెస్ అయిన తర్వాత అమ్మడు స్వదేశం నుంచి అదే స్థాయిలో విమర్శలు ఎదుర్కుంది. ఓ భారతీయ నటి విచ్చల విడిగా నటించడం ఏంటి? అనే అంశంపై ఎన్నో విమర్శలు ఎదుర్కుంది. అయితే పీసీ సక్సస్ జర్నీలో అత్యంత కీలక పాత్ర ధారి మామ్ మధు చోప్రా అన్న సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియాంక చోప్రా నటి అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదుట. తనకి సైకాలజిస్ట్ అవ్వాలనే కోరికతో ఉండేదట.
తొలి సినిమాకి సంతకం అమ్మ ఒత్తిడితోనే చేసిందిట. ఆ సమయంలో ఎంతో ఏడ్చిందిట. ఆ సంగతేంటో మామ్ మధు చోప్రా మాటల్లోనే.. ' మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన తర్వాత ప్రియాంకకు సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. కానీ తనకి నటించాలనే ఆసక్తి ఎంత మాత్రం లేదు. బాగా చదువుకుని సైకాలజిస్ట్ లేదా ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంది. కానీ అప్పుడే సినిమా అవకాశాలు రావడంతో నేను చదువు తర్వాత చూద్దాం సినిమాలు చేయ్ అని చెప్పా. నా బలవంతం మీదనే తొలి సినిమాకి కన్నీళ్లు పెట్టుకుంటూ సైన్ చేసింది' అని తెలిపారు.
సాధారణంగా కూతుళ్లను సినిమా ఇండస్ట్రీకి పంపించాలంటే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. చాలా మంది వద్దు అని చెబుతారు. ఇలా ప్రోత్సహించి పంపడం అన్నది చాలా రేర్. ఆ నాడు పీసీ మామ్ ఎంతో అడ్వాన్స్ గా ఆలోచించ గలిగారు. సినిమా భవిష్యత్ ని ఊహించి కుమార్తెకు ఇష్టం లేకపోయినా ఇటువైపుగా అడుగులు వేయించి సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పీసీ పాన్ ఇండియాని దాటి పాన్ వరల్డ్ లోనే ఎంతో ఫేమస్ అయింది.