SSMB 29.. ఇంతకీ హీరోయిన్ కి విషయం తెలుసా..?
రాజమౌళి సినిమా గురించి ఏదైనా వార్త వేసినా చాలు అది వెంటనే వైరల్ అవుతుంది.
By: Tupaki Desk | 4 Jan 2025 5:32 AM GMTసూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా పూజా కార్యక్రమాలైతే పూర్తయ్యాయి. మీడియాకు ఆ వీడియోస్ రాకుండా రాజమౌళి సూపర్ ప్లాన్ చేశాడు. దాదాపు షూటింగ్ అంతా కూడా ఇలానే చాలా సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. ఫారెస్ట్ అడ్వెంచర్ గ్లోబల్ త్రొట్టింగ్ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎంపిక ఇంకా ఫైనల్ అవ్వలేదు. కానీ మీడియా మాత్రం ప్రియాంక చోప్రా ఫిక్స్ అని ఒకటే హడావిడి చేస్తున్నారు. రాజమౌళి సినిమా గురించి ఏదైనా వార్త వేసినా చాలు అది వెంటనే వైరల్ అవుతుంది. అందుకే జక్కన్న సినిమా అంటే చాలు మీడియా అంతా అలర్ట్ గా ఉంటుంది.
మహేష్ 29 సినిమాలో ముందు హాలీవుడ్ హీరోయిన్ నే తీసుకోవాలని అనుకున్నారు కానీ మధ్యలో ఏమైందో ఏమో కానీ ప్రియాంకా చోప్రా డిస్కషన్స్ లోకి వచ్చింది. రాజమౌళి ఆలోచన ఏంటన్నది తెలియదు కానీ ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా హీరోయిన్ గా ప్రియాంక చోప్రాని కన్ఫర్మ్ చేస్తున్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ ప్రమోట్ అయ్యాక మళ్లీ తిరిగి ఇండియన్ సినిమాల వైపు చూడలేదు ప్రియాంకా చోప్రా. కానీ ఆమెను తీసుకు రావాలనే ప్రయత్నాలైతే ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. రాజమౌళి అండ్ టీం ఈ విషయాన్ని ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారన్నది చూడాలి.
ఐతే ఒకవేళ రాజమౌళి ఆమెకు ఆఫర్ ఇస్తే మాత్రం కాదనే ఛాన్స్ లేదు. ఎలాగు మన దగ్గర పీసీ క్రేజ్ ఏంటో తెలిసిందే. అదే కాకుండా రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ లో ఇంపాక్ట్ చూపించింది. అందుకే మహేష్ సినిమాకు ఆఫర్ వస్తే మాత్రం కాదనే ఛాన్స్ అయితే లేదు. ఐతే ప్రియాంక చోప్రా దాకా రాజమౌళి వెళ్లాడో లేదో తెలియదు కానీ మహేష్ సినిమాలో ఆమె ఫిక్స్ అన్నట్టుగా మీడియా ఒకటే హంగామా చేస్తుంది.
పీసీ సినిమాలో ఉంటే అటు గ్లామర్ పరంగా ఇటు యాక్టింగ్ పరంగా అదిరిపోతుంది. ఆమె ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అన్నట్టే ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. బాలీవుడ్ లోనే ఇంతకుముందు ఎన్నో అవకాశాలు వచ్చినా కాదనేసిన ప్రియాంక చోప్రా మరి తెలుగు సినిమాకు సైన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. పీసీ ఓకే అంటే మాత్రం ఈ ప్రాజెక్ట్ కు మరింత బూస్టింగ్ వచ్చినట్టే లెక్క.