Begin typing your search above and press return to search.

'సిటాడెల్ సీజ‌న్ 2'కి హ‌లో చెప్పి షాకిచ్చిన పీసీ

అయితే సిటాడెల్ సిరీస్ మునుప‌టి సీజ‌న్ ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ పొంద‌లేద‌ని టాక్ వినిపించింది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 1:30 AM GMT
సిటాడెల్ సీజ‌న్ 2కి హ‌లో చెప్పి షాకిచ్చిన పీసీ
X

ప్రియాంక చోప్రా 2023 అమెరికన్ సిరీస్ `సిటాడెల్‌`లో రిచర్డ్ మాడెన్‌తో కలిసి నటించిన సంగ‌తి తెలిసిందే. లేడీ స్పై ఏజెంట్ పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. గ‌గుర్పొడిచే స్టంట్స్, వేడెక్కించే రొమాన్స్ తో పీసీ గుబులు పుట్టించింది. ఇప్పుడు ఈ భామ‌ రెండవ సీజన్‌ను ప్రారంభించింది. సోమవారం తెల్లవారుజామున సిటాడెల్ సీజన్ 2కి `హలో` చెప్ప‌డంతో దీనిపై అభిమానుల‌కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇన్ స్టాలో సిటాడెల్ సీజన్ 2 సెట్స్‌కి వెళుతున్న‌ప్ప‌టి ప్రయాణ వీడియోను షేర్ చేసింది. పీసీ తన డ్రైవ్‌ను క్యాప్చర్ చేసి, క్యాప్షన్‌లో `హలో సిటాడెల్ S2` అని రాసింది. వేకువ‌ఝాము అంటే 5:39 AMకి `మండే ప్రేరణ!` అనే స్టిక్కర్‌ను ఉపయోగించింది.


అయితే సిటాడెల్ సిరీస్ మునుప‌టి సీజ‌న్ ఆశించిన స్థాయిలో ఆద‌ర‌ణ పొంద‌లేద‌ని టాక్ వినిపించింది. దీనికోసం భారీ మొత్తాల‌ను ఖ‌ర్చు చేయ‌డంతో అమెరిక‌న్ టీవీ నిర్మాత‌లు సీరియ‌స్ అయ్యార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఇప్పుడు సీజ‌న్ 2ని న‌మ్మ‌కంగా ప్రారంభించ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక ప్రియాంక చోప్రా ఇటీవల తన బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని వెచ్చించి తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీ చోప్రా జోనాస్‌తో కలిసి దక్షిణ ఫ్రాన్స్‌లో విహారయాత్ర చేసింది. ఈ విహారానికి సంబంధించిన ఫోటోల‌ను ఇన్ స్టాలో షేర్ చేయ‌గా వైర‌ల్ అయ్యాయి. అంద‌మైన‌ జ్ఞాపకాలను పీసీ త‌న‌ అనుచరులతో షేర్ చేసుకుంది. ప్రియాంక ఓ యాచ్‌లో బికినీ లుక్ లో క‌నిపించింది. ఒక వీడియోలో తన తల్లి పీసీ వెంట్రుకలతో మాల్తీ ఆడుకోవడం క‌నిపించింది. ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.


పీసీ కెరీర్ సంగ‌తిని ప‌రిశీలిస్తే.. ఈ ఏడాది ఇప్పటికే హెడ్స్ ఆఫ్ స్టేట్- ది బ్లఫ్ అనే రెండు హాలీవుడ్ సినిమాల చిత్రీకరణను ముగించింది. మరాఠీ ప్రొడక్షన్ `పానీ` విడుదలకు కూడా సిద్ధమవుతోంది. జాతీయ అవార్డు గెలుచుకున్న ఈ చిత్రం 18 అక్టోబర్ 2024న థియేట‌ర్ల‌లోకి రానుంది.


సిటాడెల్ సిరీస్ భారతీయ స్పిన్‌ఆఫ్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కానున్న సంగ‌తి తెలిసిందే. సిటాడెల్: హనీ బన్నీ పేరుతో ఇది విడుద‌ల కానుంది. ఈ షోకు రాజ్ - డికె దర్శకత్వం వహించారు. భార‌తీయ వెర్ష‌న్ లో వరుణ్ ధావన్ -సమంతా రూత్ ప్రభు ప్ర‌ధాన పాత్ర‌ల్లో నటించారు. ఆగస్ట్‌లో ఈ సిరీస్ టీజర్‌పై ప్రియాంక చోప్రా స్పందించింది. దర్శక ద్వయం రాజ్ అండ్ డీకేపై ప్రశంసలు కురిపించింది. మెయిన్ లీడ్స్ గొప్ప‌గా న‌టించార‌ని కితాబిచ్చింది.