పీసీ (X) నిక్: పర్ఫెక్ట్ లిప్ లాక్.. పర్ఫెక్ట్ కపుల్.. మాల్తీ ఏంటి ఆ రియాక్షన్?
ఆరేళ్లుగా వారి అన్యోన్యత, స్నేహం, అంతులేని ప్రేమ అభిమానులకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది.
By: Tupaki Desk | 18 Sep 2024 12:30 AM GMTఈ అందమైన జంట ఒకరికోసం ఒకరు.. ఒకరు లేని లోకంలో మరొకరు లేరు! అంతగా అన్యోన్య దాంపత్యంతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇంతకీ ఈ జంట ఎవరో చెప్పాల్సిన పని లేదు. ది గ్రేట్ ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ గురించే ఇదంతా. నిక్ ని భారతీయ వనిత పీసీ పెళ్లాడిన కొద్ది రోజులకే పాపులర్ అమెరికన్ పత్రిక ఈ జంటపై విషం కక్కింది. వీళ్ల మధ్య అన్యోన్యత లేదని, త్వరలోనే విడిపోతున్నారని కూడా రాసేసింది. అయితే ఈ కక్ష పూరిత కథనం ఎప్పటికీ నిజం కాదని నిరూపించింది ప్రియానిక్ జంట. ఆరేళ్లుగా వారి అన్యోన్యత, స్నేహం, అంతులేని ప్రేమ అభిమానులకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది. పీసీ ఎంతో స్వేచ్ఛగా జాయ్ ఫుల్ గా విదేశీ భర్తతో ముందుకు సాగుతోంది.
ఇక మాల్తీ మేరీ రాకతో పీసీ-నిక్ జంట మరింత ఆనందంగా ఉన్నారు. మాల్తీని వదిలి క్షణమైనా ఉండదు ఈ జోడీ. కపుల్ గోల్స్ అన్న పదానికి నిదర్శనంగా నిలుస్తున్నారు. తాజాగా జోనాస్ బ్రదర్స్ ఈవెంట్లో మాల్తీ మేరీ సందడి చేసిన తీరు చూసాక ఈ విషయాన్ని మీరే చెబుతారు. మరోవైపు ఇదే వేదికపై ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ డీప్ లిప్ లాక్ అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. మమ్మీ డాడీ అలా లిప్ లాక్ వేస్తుంటే కుమార్తె మాల్తీ మేరీ ఏం చేసిందో చూస్తున్నారు కదా! అలా తన కళ్లకు చేతులు అడ్డు పెట్టుకుని ``నా కళ్లతో నేను చూడలేను ఈ రచ్చ`` అన్నట్టుగానే కనిపిస్తోంది. ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ని కెమెరా క్యాప్చుర్ చేసిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాలి. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
పీసీ ఇన్ స్టాలో ఈవెంట్ నుంచి కొన్ని వీడియోలను కూడా షేర్ చేసింది. వాటికి ఒక అందమైన క్యాప్షన్ ఇచ్చింది. ``సోమవారం రాత్రులు చాలా సరదాగా ఉండకూడదు`` అంటూ కొంటెగా క్యాప్షన్ ఇచ్చింది. అంతేకాదు పీసీ తన గతంలోకి వెళ్లి సుదీర్ఘమైన నోట్ రాసింది.
24 ఏళ్ల క్రితం ఈ ఎరీనాలో మిస్ వరల్డ్ కిరీటాన్ని పొందాను. అప్పట్లో దీనిని మిలీనియం డోమ్ అని పిలిచేవారు. నేను నా చిన్నప్పటి 18 ఏళ్లను ఎప్పటికీ మరచిపోలేను. ఉత్సాహంగా, నాడీగా .. పోటీతత్వంతో నేను ఉత్తమంగా కనిపించడానికి ప్రయత్నిస్తున్నాను. 30 నవంబర్ 2000 నుండి నేను ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకం.. అందమైన హేమంత్ త్రివేది డ్రెస్‌తో పెన్సిల్ హీల్స్‌పై బ్యాలెన్స్ చేస్తున్న అనుభూతి.. అది నా బాడీ టేప్ ఆన్‌లో ఉండదు. ఎందుకంటే నాకు చాలా చెమటలు పట్టాయి. అందుకే మీరు గూగుల్ లో ఫోటోలు వెతికితే నేను గెలిచిన తర్వాత, నేను కృతజ్ఞతతో నమస్తే చెబుతూ కనిపిస్తాను. కానీ నేను నిజంగా నా దుస్తులను జారకుండా ఆపడానికి తీవ్రంగా ప్రయత్నించాను. అప్పటికి నేను బ్రతికిపోయాను.. చివరికి అంతా బాగానే ముగిసింది.. అని తెలిపింది.
… నా భర్త , అతని సోదరులు, నా కుమార్తె, కుటుంబం, స్నేహితులతో కలిసి ఇక్కడకు తిరిగి రావడం చాలా పూర్తి వృత్తం.. జీవితం బాగుంది.. కృతజ్ఞత... అని కూడా పీసీ ఆనందం వ్యక్తం చేసింది. ఈ స్పెషల్ ఫోటోగ్రాఫ్ పై ఇన్ స్టాలో అభిమానులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ``బేబీ మాల్టీని చూడు ఆమె సిగ్గుపడుతూ ఉంది .. అందంగా ఉంది ..`` అంటూ పై ఫోటోని చూసిన అభిమానులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.