SSMB29 తర్వాత PC నెక్ట్స్ ఏంటి?
గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా(పీసీ) బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో ప్రవేశించి అక్కడా తన స్థాయిని నిరూపించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 March 2025 9:47 AM ISTగ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా(పీసీ) బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో ప్రవేశించి అక్కడా తన స్థాయిని నిరూపించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సిటాడెల్ -2 సిరీస్ లో నటిస్తున్న పీసీ తిరిగి భారతీయ సినీపరిశ్రమలో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పీసీ ఒక సౌత్ సినిమాతో ఘనమైన పునరారంగేట్రాన్ని చాటుకోనుంది.
దీనికోసం ప్రస్తుతం మకాం ముంబై నుంచి హైదరాబాద్ కి మార్చింది. సూపర్ స్టార్ హహేష్ - రాజమౌళి కాంబినేషన్ లోని #SSMB29లో ఒక కథానాయికగా నటిస్తోంది. ఇటీవల షూటింగ్ లో ప్రియాంక చోప్రా ఫుల్ బిజీగా ఉంది. హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ప్రస్తుతం చిత్రీకరణ సాగుతోందని సమాచారం.
ఈ చిత్రం కోసం మహేష్ చాలా శ్రమిస్తున్నారు. తన తొలి తెలుగు చిత్రం కోసం పీసీ చాలా హార్డ్ వర్క్ చేస్తోంది. మరోవైపు ప్రియాంక చోప్రా మరిన్ని భారీ ప్రాజెక్టులపై సంతకాలు చేస్తోంది. ఫర్హాన్ అక్తర్ జీలే జరాలో కూడా నటించాల్సి ఉంటుంది. అయితే ఇది చాలా ఆలస్యమైంది. దీనిని ఫర్హాన్ అక్తర్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
అలాగే హాలీవుడ్ చిత్రం `హెడ్స్ ఆఫ్ స్టేట్`కి సంతకం చేసిందని కథనాలొచ్చాయి. మహేష్ బాబుతో ఎస్.ఎస్.ఎం.బి 29 చిత్రీకరణ 2025- 2026 అంతటా కొనసాగుతుంది. ఈ సినిమాని రెండు భాగాలుగా రాజమౌళి ప్లాన్ చేస్తున్నారని దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తారని కూడా కథనాలొస్తున్నాయి.